Wednesday, 4 February 2015

ఎర్ర సేన లాంగ్ మార్చ్ - మొత్తం ఏడు పాటలు - MP3 ఫార్మాట్లో - మీ సెల్ ఫోన్లో డౌన్ లోడ్ కోసం...

ఎర్ర సేన లాంగ్ మార్చ్ సిడిలో మొదటి ఎంపి3 పాటకు  అద్భుతమైన స్పందన వచ్చింది.  సుమారు 40వేల  మంది దీనిని తమ సెల్ ఫోన్లలో  లోడ్ చేసుకున్నారు. ఇది అత్యంత అద్భుతమైన  పరిణామం..

పార్టీ శ్రేణులు, వామపక్ష శ్రేయోభిలాషుల ఆసక్తిని గమనించిన తరువాత మొత్తం  ఏడు పాటలూ డౌన్ లోడ్ కు వీలుగా అందుబాటులోకి తీసుకురావాలని భావించాం. ఈ కింద ఉన్న  లింకు ద్వారా మీరు మొత్తం ఏడు పాటలను ఒక్కొక్కటిగా మీ సెల్ ఫోన్లో  డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

వినండి... ఆనందించండి.. పది మందికి వినిపించండి..

అభినందనలతో --- సిపిఐ(ఎం) తెలంగాణా రాష్ట్ర కమిటీ....

రాజకీయ తీర్మానం, ఎత్తుగడల పంథా ముసాయిదాలు చర్చ కోసం విడుదల...

సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ చర్చించి ఆమోదించిన రాజకీయ తీర్మానం ముసాయిదా, ఎత్తుగడల పంథా తీర్మానం ముసాయిదాను చర్చ కోసం ప్రజల్లోకి పార్టీ విడుదల చేసింది. ఈ మేరకు  ప్రకాష్ కరత్ ఢిల్లీలో విలేకరుల సమావేశంలో వీటిని విడుదల చేశారు.

ఈ రెండు డాక్యుమెంట్ల పై ఫిబ్రవరి, మార్చి నెలల్లో పార్టీ లోని అన్ని శాఖల్లో  చర్చ జరుగుతుంది. సూచనలు, సవరణలు ఆయా డాక్యుమెంట్ల చివరల్లో నిర్దేశించిన విధంగా కేంద్ర కమిటీకి పంపొచ్చు. పార్టీ సభ్యులే కాకుండా, సాధారణ ప్రజానీకం సైతం తమ అభిప్రాయాలను కేంద్ర కమిటీకి పంపవచ్చు.

మీ సౌలభ్యం కోసం ఈ రెండింటినీ  ఒకే దగ్గర డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నాం.

1.రాజకీయ తీర్మానం ముసాయిదా నివేదిక

20150202-draft-pol-res-adopted-cc.pdf2. రాజకీయ ఎత్తుగడల పంథా తీర్మానం ముసాయిదా నివేదిక


20150130-pol-tac-line-cc-adopted.pdf

Wednesday, 28 January 2015

తెలం`గానాలు`- ప్రచార గీతాలు....... సిపిఐ(ఎం) తెలంగాణా తొలి మహాసభల పాటలు మీకోసం
మీకోసం తెలం`గానాలు` సిద్ధమయ్యాయి. మంగళవారం నాడు జరిగిన ప్రెస్ మీట్ లో సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్యదర్శి వర్గ సభ్యులు సారంపల్లి మల్లారెడ్డిగారు వీటిని ఆవిష్కరించారు.

ఈ కింద ఉన్న టేబుల్ లో పాట పేరు మీద క్లిక్ చేస్తే యూ ట్యూబ్ ద్వారా ఒక్కో పాటను వినొచ్చు...  వినండి.. పాడండి.. ప్రచారం చేయండి..


పాటరచన గానం
1.గోలుకొండ అదిరేలా కొట్టాలి డప్పు కె.దేవేంద్ర రాంకి
2. ఇంటికొక్క మనిషి ఊరికొక్క బండి ప్రభాకర్ ఎ.ప్రసాద్
3. భాగ్యనగరం ముస్తాబయిందిరో ఎస్.కె.జమీల్  పాషా అరూరి కుమార్
4. ఎంతకాలం మిట్ల  మోసపోకు కన్నెగంటి వెంకటయ్య లెనినా
5. తెలంగాణ గానం సాంబరాజు యాదగిరి కాంపాటి  శ్రీను
6. మందారమ ఓ మందారమా ఎ.భాస్కర్ వి.సదానంద్
7. చెట్టు  పేరు చెప్పి భగత్ సింగ్ పి.వెంకట్ రెడ్డి
8. మట్టి బిడ్డడు మాయమౌతుండే చింతల యాదగిరి చింతల యాదగిరి
9. ఉడికిందని తెలిపేందుకు పోతగాని వి.సదానంద్


 కొన్ని పాటలు డౌన్  లోడ్ చేసుకోవచ్చు.. రింగ్ టోన్లుగా సైతం పెట్టుకోవచ్చు. ఈ కింద ఉన్న వాక్యాన్ని క్లిక్ చేయండి.