B.V.Raghavulu |
హైదరాబాద్ : సీపీఎం పార్టీని గెలిపిస్తే ఆర్టీసీ, విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తామని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పేర్కొన్నారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో సీపీఎం పోటీచేసిన అభ్యర్ధులను గెలిపిస్తే ప్రజా సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని హామీనిచ్చారు. సీపీఎంను గెలిపిస్తే ఆర్టీసి, విద్యుత్ సమస్యల్ని పరిష్కరించడంతో పాటు పారిశ్రామికీకరణ, పెట్టుబడులపై ప్రధానంగా దృష్టిసారిస్తామని తెలిపారు. సీపీఎం అభ్యర్థుల్ని, సీపీఎం బలపరచిన అభ్యర్థుల్ని గెలిపించాలని రాఘవులు కోరారు. ఈ సభలో ఎంపీ సీతారాం ఏచూరి పాల్గొన్నారు.
No comments:
Post a Comment