#uturnsarkar #facistforces #attackOnSecularism
ముస్లింలు, క్రైస్తవులు, దళితులపై ఫాసిస్టు మూకల ముప్పేట దాడి...
ఓ వైపు `ఘర్ వాపసీ`!... మరోవైపు క్రిస్మస్ సెలవుల రద్దు...!! గోవధ నిషేధంపై కొత్త చట్టం!!!
`ముంచుకొస్తున్నాదీ మతోన్మాద గండం.... ముందుకొచ్చి ఆపండి అందరికీ దండం..` అని కవి ఊరకనే అనలేదు. ఈనాడు భారతదేశానికి అలాంటి గండం ముంచుకొచ్చింది. ఓ వైపు మత మార్పిడులు యథేచ్చగా జరిగిపోతున్నాయి. గతంలో హిందూ మతం వీడినందుకు శిక్షగా ఫైన్ కట్టి మరీ మతాన్ని మార్చేందుకు ఫాసిస్టు మూకలు `ఘర్ వాపసీ` అనే కార్యక్రమాన్ని చేపట్టాయి. యుపి రాయబరేలిలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు విహెచ్ పి బహిరంగ ప్రకటన చేసింది.
మరోవైపు విద్యను కాషాయీకరించే ప్రాజెక్టు చేపట్టిన మోడీ సర్కార్ తాజాగా క్రిస్మస్ సెలవును రద్దు చేస్తూ సిఫారసులు జారీ చేసింది. దీనిని రాజ్యసభలో సిపిఎం గట్టిగా ఖండించింది. విపక్షాలూ తోడయ్యాయి. లోక్ సభలోనూ దీనికి కొనసాగింపుగా విపక్షాలు పెద్ద ఎత్తున నిలదీశాయి. దీంతో ప్రభుత్వం కొంత వెనక్కు తగ్గింది.
గోవధను నిషేధించేందుకు హర్యానా ప్రభుత్వం చట్టం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుందట. `గోవధ, పశువుల దొంగతనం మత ఉద్రిక్తతలను సృష్టిస్తోంద`న్న సాకుతో ఈ దుశ్చర్యకు తెగబడుతోంది. అధికారంలో ఉన్నది మతతత్వ శక్తులే అయితే మత ఉద్రిక్తతలు ఎందుకు రావు? ఆవు, ఎద్దు, బర్రె వీటిని ముస్లింలు మాత్రమే తింటారనే ఆపోహ చాలా మందిలో ఉంది. ఇది తప్పు. హిందూ మతంలోనే ఆనాదిగా వివక్షకు గురవుతూ వస్తున్న దళితుల ఆహారమిది. గోవధ నిషేధ చట్టం అంటే దళితుల ఆహారపుటలవాట్ల మీద అగ్రవర్ణ దురహంకారపూరిత దాడి మాత్రమే. అంతేకాదు నేపాల్ లాంటి దేశాల్లో గోవధ అనేది హిందూ మత ఆచారం. మనదేశంలో బ్రాహ్మణులు ఏది చెబితే అదే హిందూ ఆచారం అయిపోతోంది. వారి ఇష్టాయిష్టాలు, ఆహారపుటలవాట్లు దళితులపై బలవంతంగా రుద్ద బడుతున్నాయి.
(ఈ పోస్టులో ఉండే మూడో ఫొటో చూడండి. హిందువులే గోసంతతిని బలి ఇస్తున్నారు. వేరే మతస్తులు కాదు..)
చివరగా ఒక్క మాట... మతం పై దాడి జరుగుతోంది. మత ఆచారాలపై దాడి జరుగుతోంది. ఆఖరకు ఆహారపుటలవాట్లనూ వదిలిపెట్టడం లేదు. మరి మతోన్మాదగండం ముంచకొచ్చినట్లేనా? ఇంకా రానట్లా? వేచి చూద్దామా? లేదా లౌకికతత్వాన్ని కాపాడుకునేందుకు నడుం బిగిద్దామా? ఆలోచించండి.
#christmas #banOnCowSlaughter #Gharvapasi #protectSecularism

6,992 people reached
ఇక్కడ కొంతమంది కామెంట్లు చూస్తుంటే బాదేస్తుంది. ఇన్నాళ్లు మాతమార్పిడీలు జరుగుతుంటే మాట్లాడని వారు ఇప్పుడేందుకు మాట్లాడుతున్నారు? అని కొంతమంది అడ్డగోలు వాదనకు దిగుతున్నారు. మరి ఇన్నాళ్లు వాళ్లు ఏం చేశారో మాత్రం చెప్పరు. మతం అనేది వ్యక్తిగత ఇష్టం. కమ్యూనిస్టులు ఎప్పుడూ మతస్వేచ్ఛను అడ్డుకున్న సందర్భాలూ లేవు. అది ఏ మతమైనా. కనీసం ఇంట్లో ఇల్లాలు అభిప్రాయాలను సైతం గౌరవిస్తారు. అయితే ఇప్పుడే ఈ చర్చ ఎందుకు జరుగుతుందన్న కనీస జ్నానం ఒక్కడ కొంతమంది అజ్నానులకు ఎందుకు అర్థం కావడంలేదో తెలియడంలేదు. కేవలం హిందూ ఉన్మాది అయినంత మాత్రాన గాంధీజీని చంపిన గాడ్సేను దేశభక్తుడని చాటేందుకు అధికారంలోకి వచ్చిన బిజెపి అనుబంధ సంస్థలు చాపకింద నీరులా తమ ప్రయత్నాలను ప్రారంభించాయి. ఇది ఇక్కడి కుహానా మేధావులు ఎలా సమర్ధించుకుంటారో వారే చెప్పాలి. ప్రభుత్వం కొన్ని మతాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం.. మతం ఎజెండాతో పనిచేయడాన్ని మాత్రమే సిపిఎం తప్పబడుతోెంది. విఛ్చిన్నమైన సోవియట్ యూనియన్ లో ఇప్పుడు చాలా చిన్న చిన్న దేశాలు మళ్లీ కమ్యూనిజం వైపు చూస్తున్నాయి. లాటిన్ అమెరికాలో చాలా దేశాల్లో కమ్యూనిస్టుల ప్రాభల్యం పెరుగుతోంది. ప్రజాస్వామ్య విలువలను, ప్రజాతంత్రవాదాన్ని ఎంతోకొంత కాపాడుతుంది కమ్యూనిస్టు ప్రభుత్వాలే. అంతేందుకు ఏదో జరుగుతుంది అని యావత్ దేశాన్ని తప్పుదోవ పట్టించి.. బెంగాల్ లో వామపక్ష ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా కూల్చివేయడంలో టిఎంసీకి ఆయుధంగా మారిన కిషన్ జీ.. ఎందుకు మమత అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు? ఒకవేళ వామపక్ష ప్రభుత్వం అందరూ ఆరోపించినట్లు వ్యవహరించేదే అయితే.. కిషన్ జీ ని ఎందుకు టార్గెట్ చేయలేదు?.. ఇలాంటి విషయాలను కులంకుషంగా చర్చిస్తే వామపక్షాల విలువ అర్థం అవుతుంది.
ReplyDelete