Tuesday, 22 April 2014

ఆర్టీసీ, విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తాం - బీవీ రాఘవులు...

B.V.Raghavulu

హైదరాబాద్ : సీపీఎం పార్టీని గెలిపిస్తే ఆర్టీసీ, విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తామని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పేర్కొన్నారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో సీపీఎం పోటీచేసిన అభ్యర్ధులను గెలిపిస్తే ప్రజా సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని హామీనిచ్చారు. సీపీఎంను గెలిపిస్తే ఆర్టీసి, విద్యుత్‌ సమస్యల్ని పరిష్కరించడంతో పాటు పారిశ్రామికీకరణ, పెట్టుబడులపై ప్రధానంగా దృష్టిసారిస్తామని తెలిపారు. సీపీఎం అభ్యర్థుల్ని, సీపీఎం బలపరచిన అభ్యర్థుల్ని గెలిపించాలని రాఘవులు కోరారు. ఈ సభలో ఎంపీ సీతారాం ఏచూరి పాల్గొన్నారు.

cpim election campaign


Monday, 21 April 2014

తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం ప్రత్యేక విధివిధానాలు అవసరం- రోడ్డుషోల్లో తమ్మినేని 
ప్రజాశక్తి- వరంగల్‌ ప్రతినిధి/ ఉప్పల్‌
                   తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక విధివిధానాలు అవసరమని, ఆ దిశగా పనిచేసే వారికి ఓట్లు వేయాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రజలకు పిలుపునిచ్చారు. అవినీతి కాంగ్రెస్‌ను, మతోన్మాద బిజెపిలను ఓడించాలని కోరారు. సిపిఎం, ఆ పార్టీ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రంగారెడ్డి, వరంగల్‌ జిల్లాల్లో రోడ్‌ షో, బహిరంగ సభల్లో ఆదివారం పాల్గొన్నారు. 
                 ఉప్పల్‌, మల్కాజిగిరి, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎస్‌ నర్సింహారెడ్డి, డిజి నర్సింహారావు, మెట్టు శ్రీనివాస్‌, మల్కాజిగిరి పార్లమెంటరీ స్థానం స్వతంత్ర అభ్యర్థి ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ విజయాన్ని కాంక్షిస్తూ రోడ్డు షోల్లో ఆయన మాట్లాడుతూ ధనబలం, కండబలంతో దిగుతున్న వారిని ఓడించాలని, పేదల కోసం పనిచేసేవారిని గెలిపించాలని కోరారు. నీతివంతమైన పాలన సిపిఎంతోనే సాధ్యమని స్పష్టం చేశారు. తెలంగాణలో 40 లక్షల దళిత కుటుంబాలున్నాయని, వారి అభివృద్ధి గురించి ఆలోచించని నాయకులను ముఖ్యమంత్రిగా చేస్తే ఫలితం ఉంటుందా అని ప్రశ్నించారు. దళితులకు 16వేల కోట్లు, గిరిజనులకు 8వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించాల్సిన అవసరముందన్నారు. సిపిఎంకు ఒక్క ఎమ్మెల్యే ఉన్నా ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ సాధించగలిగారని గుర్తు చేశారు. ప్రజా క్షేమం గురించి ఆలోచించే తత్వం వామపక్ష పార్టీలకే ఉంటుందన్నారు. హైదరాబాద్‌ జిల్లా అభివృద్ధి గురించి ఊకదంపుడు ప్రచారాలు ఆపి అసలు ఆ జిల్లాలోని మండల కేంద్రాల్లో ప్రభుత్వ కళాశాలు, ఆస్పత్రులు ఎందుకు నిర్మించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మురికివాడల ప్రజల ఇబ్బందులు నేతలు పట్టవా అని ప్రశ్నించారు. సంస్కరణల పేరుతో బిజెపి, కాంగ్రెస్‌లు ప్రజలను మోసం చేస్తున్నాయని, అభివృద్ధి అంటే పేదల పొట్ట గొట్టడమేనా అని ప్రశ్నించారు. సారయ్య మంత్రి పదవి చేపట్టినా వరంగల్‌ జిల్లాకు ఒరిగిందేమీ లేదన్నారు. జిల్లాలో ఒక్క పరిశ్రమను కూడా ఏర్పాటు చేయించలేకపోయారని విమర్శించారు. వరంగల్‌ రోడ్‌షోలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి నాగయ్య, నాయకులు నలిగంటి రత్నమాల, కొప్పుల శ్రీనివాస్‌, దుబ్బ శ్రీనివాస్‌, రమణ, గడ్డం రమేష్‌ పాల్గొన్నారు.

cpim ElecctionCampaign

cpim ElecctionCampaign

Sunday, 20 April 2014

cpim

cpim

మోడీ ప్రధానైతే దేశం రావణ కాష్టమే: తమ్మినేని

Tammineni Veerabhadram 
  
వరంగల్: నరేంద్ర మోడీ ప్రధానైతే దేశాన్ని రావణకాష్టం చేస్తాడని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖిల్లా వరంగల్ లో ఆదివారం ఆ పార్టీ నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. గుజరాత్ లో మూడు వేల మంది ముస్లీం మైనారిటీలను మోడీ ఊచకోత కోశారని విమర్శించారు. కులాలు, మతాల మధ్య కోట్లాటలు పెట్టి గుజరాత్ ను రావణ కాష్టంగా మార్చాడని తెలిపారు. మతోన్మాద మోడీని ప్రధానిని చేయడం తప్పు అని పేర్కొన్నారు. బీజేపీ నేతలు ఓట్ల కోసం రామమందిర నిర్మాణం పేరుతో హిందువులను రెచ్చగొడుతున్నారన్నారు. బీజేపీ మతోన్మాద వైఖరిని వ్యతిరేకించాలని సూచించారు. మతాల మధ్య చిచ్చుపెట్టడం దేశానికి నష్టదాయకమన్నారు. మోడీని సమర్థిస్తేనే దేశంలో ఉండాలా లేకపోతే పాకిస్తాన్ వెళ్లాలా అని ప్రశ్నించారు. భారతదేశంలో అనేక రకాల మతాలకు చెందిన వారు ఐక్యమత్యంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. మతాల మద్య చిచ్చుపెడితే దేశం కుక్కలు చింపిన విస్తరాకు అవుతుందన్నారు. అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు రేషన్ కార్డులను తగ్గిస్తున్నాయని, సంక్షేమ పథకాలను తొలగిస్తున్నారని చెప్పారు. నిత్యవసరాల ధరలను పెంచి ప్రజలపై అధిక భారాలను మోపుతున్నాయని చెప్పారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం భూములను కట్టబెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 లక్షల కోట్ల రూపాయలను ధనవంతులకు సహాయం చేసిందని మండిపడ్డారు. సిపిఎం ప్రజల పక్షాన పోరాడి పేదలకు గుడిసెలు వేయించిందని గుర్తు చేశారు. నీడనిచ్చిన ఎర్రజెండాను మరిచిపోద్దవని సూచించారు. లౌకికవాద శక్తులను, ప్రజల తరపున పోరాడే వారిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ సమగ్ర అభివృద్ధి చెందాలి- తమ్మినేని

Thammineni Veerabhadram
thammineni veerabhadra 
హైదరాబాద్: సామాజిక తెలంగాణ కోసం సీపీఎం కట్టుబడి ఉందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం పార్టీ తరపున ఉప్పల్ లో ఆదివారం నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. సీపీఎం ప్రజల పక్షాన పోరాడుతుందని చెప్పారు. తెలంగాణలో సాధారణ పౌరునుకి సైతం అభివృద్ధి ఫలాలు అందినపుడే అది జన తెలంగాణ అవుతుందని అన్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ కోసం సీపీఎం పోరాడిందని చెప్పారు. హరిజన వాడలను అభివృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. గిరిజన తండాల అభివృద్ధికి రాష్ట్ర బడ్టెట్ లో 8 శాతం నిధులు కేటాయించాలని చెప్పారు. సీపీఎం తెలంగాణ సమగ్ర అభివృద్ధిని కోరుకుంటోందని అన్నారు. హైదరాబాద్ లోనే కాదు మారుమూల ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. కార్మికుల హక్కుల కోసం పోరాడిన ఉప్పల్ నియోజకవర్గ సీపీఎం అభ్యర్ధి నర్సింహారెడ్డిని గెలిపించాలనిరారు.

ElecctionCampaign