మళ్లీ 108 పరుగులు...
108పై స్పందించిన ముఖ్యమంత్రి
108పై 'ఆపదలో అపర సంజీవిని` పేరుతో వచ్చిన కథనానికి, సోషల్ మీడియాలో కూడా ప్రచారం తోడవ్వడంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పందించారు. వాహనాలు నిలిచిపోవడంతో ప్రభుత్వం యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, జివికె సంస్థ సిఇఓ విద్యాసాగర్, కో ఆర్డినేటర్ సుశీలా, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం డైరెక్టర్ డాక్టర్ కల్పన, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కిషోర్‌లను తన ఛాంబర్‌కు పిలిపించుకుని 108 వాహనాలను వెంటనే పునరుద్దరించాల్సిందిగా ఆదేశించారు. 108 వాహనాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి హెచ్చరికతో ఆఘమేఘాల మీద 108 వాహనాలపై మంత్రి, ఉన్నతాధికారులు ఆరా తీశారు. బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం హామీ ఇవ్వడంతో జివికె సంస్థ కొన్ని గంటల్లోనే అపర సంజీవిని రోడ్డెక్కించింది. కాగా 108 వాహనాలు నిలిచిపోవడంపై జివికె సంస్థ ప్రతినిధులపై ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయకపోవడం వల్లే జివికెకు బకాయిలు పేరుకుపోయాయని వారు మంత్రికి వివరణనిచ్చారు. కాగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో చెల్లించాల్సిన బకాయిలకు ప్రత్యేక జిఒ తేవాల్సి ఉందని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రతినెల బకాయిలు చెల్లిస్తోందని మంత్రి వివరించారు.
No comments:
Post a Comment