Wednesday 17 December 2014

ముస్లింలు, క్రైస్తవులు, దళితులపై ఫాసిస్టు మూకల ముప్పేట దాడి... (చర్చ)

#uturnsarkar #facistforces #attackOnSecularism
ముస్లింలు, క్రైస్తవులు, దళితులపై ఫాసిస్టు మూకల ముప్పేట దాడి...

ఓ వైపు `ఘర్ వాపసీ`!... మరోవైపు క్రిస్మస్ సెలవుల రద్దు...!! గోవధ నిషేధంపై కొత్త చట్టం!!!

`ముంచుకొస్తున్నాదీ మతోన్మాద గండం.... ముందుకొచ్చి ఆపండి అందరికీ దండం..` అని కవి ఊరకనే అనలేదు. ఈనాడు భారతదేశానికి అలాంటి గండం ముంచుకొచ్చింది. ఓ వైపు మత మార్పిడులు యథేచ్చగా జరిగిపోతున్నాయి. గతంలో హిందూ మతం వీడినందుకు శిక్షగా ఫైన్ కట్టి మరీ మతాన్ని మార్చేందుకు ఫాసిస్టు మూకలు `ఘర్ వాపసీ` అనే కార్యక్రమాన్ని చేపట్టాయి. యుపి రాయబరేలిలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు విహెచ్ పి బహిరంగ ప్రకటన చేసింది.
మరోవైపు విద్యను కాషాయీకరించే ప్రాజెక్టు చేపట్టిన మోడీ సర్కార్ తాజాగా క్రిస్మస్ సెలవును రద్దు చేస్తూ సిఫారసులు జారీ చేసింది. దీనిని రాజ్యసభలో సిపిఎం గట్టిగా ఖండించింది. విపక్షాలూ తోడయ్యాయి. లోక్ సభలోనూ దీనికి కొనసాగింపుగా విపక్షాలు పెద్ద ఎత్తున నిలదీశాయి. దీంతో ప్రభుత్వం కొంత వెనక్కు తగ్గింది.
గోవధను నిషేధించేందుకు హర్యానా ప్రభుత్వం చట్టం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుందట. `గోవధ, పశువుల దొంగతనం మత ఉద్రిక్తతలను సృష్టిస్తోంద`న్న సాకుతో ఈ దుశ్చర్యకు తెగబడుతోంది. అధికారంలో ఉన్నది మతతత్వ శక్తులే అయితే మత ఉద్రిక్తతలు ఎందుకు రావు? ఆవు, ఎద్దు, బర్రె వీటిని ముస్లింలు మాత్రమే తింటారనే ఆపోహ చాలా మందిలో ఉంది. ఇది తప్పు. హిందూ మతంలోనే ఆనాదిగా వివక్షకు గురవుతూ వస్తున్న దళితుల ఆహారమిది. గోవధ నిషేధ చట్టం అంటే దళితుల ఆహారపుటలవాట్ల మీద అగ్రవర్ణ దురహంకారపూరిత దాడి మాత్రమే. అంతేకాదు నేపాల్ లాంటి దేశాల్లో గోవధ అనేది హిందూ మత ఆచారం. మనదేశంలో బ్రాహ్మణులు ఏది చెబితే అదే హిందూ ఆచారం అయిపోతోంది. వారి ఇష్టాయిష్టాలు, ఆహారపుటలవాట్లు దళితులపై బలవంతంగా రుద్ద బడుతున్నాయి.

(ఈ పోస్టులో ఉండే మూడో ఫొటో చూడండి. హిందువులే గోసంతతిని బలి ఇస్తున్నారు. వేరే మతస్తులు కాదు..)
చివరగా ఒక్క మాట... మతం పై దాడి జరుగుతోంది. మత ఆచారాలపై దాడి జరుగుతోంది. ఆఖరకు ఆహారపుటలవాట్లనూ వదిలిపెట్టడం లేదు. మరి మతోన్మాదగండం ముంచకొచ్చినట్లేనా? ఇంకా రానట్లా? వేచి చూద్దామా? లేదా లౌకికతత్వాన్ని కాపాడుకునేందుకు నడుం బిగిద్దామా? ఆలోచించండి.
#christmas #banOnCowSlaughter #Gharvapasi #protectSecularism
6,992 people reached
93 SharesLike ·  · 
  • CPIM Telangana
    Write a comment...
  • CPIM Telangana మత మార్పిడి గురించి...

    వేరే మతం నుంచి హిందూ మతంలోకి `వస్తే` తప్పు కాదు.... సామ, దాన, బేధ, దండోపాయాలను ఉపయోగించి బలవంతంగా `లాక్కొస్తే`నే తప్పు... మత ఉద్రిక్తతలు పెంచి, భయబ్రాంతులకు గురిచేసి, వేరే మతాల్లో ఉంటే బతకలేమనే పరిస్థితులను సృష్టించి వారికై వచ్చ
    ేట్లు చేసినా దానిని కూడా `రావడం` అంటామా? `లాక్కొని రావడం` అంటామా? వారికై వారు `వస్తే` అది వ్యక్తుల ఇష్టం. `లాక్కొస్తే` అది వ్యక్తి ఇష్టం మీద దాడి. యుపి, బిహార్ లో జరుగుతున్న `ఘర్ వాపసీ` కార్యక్రమం ద్వారా ఈ `లాక్కురావడం`... గతంలో మతం మారినందుకు ఫైన్లు వేయడం బాహాటంగా జరుగుతోంది.
    Like · Reply · 4 · Commented on by Jagadish Kumar · December 16 at 1:22pm
  • CPIM Telangana క్రిస్మస్ సెలవులపై ఈ వార్త చూడండి.
    Like · Reply · 4 · Commented on by Jagadish Kumar · December 16 at 1:21pm
  • CPIM Telangana బలి గురించి...

    హరిప్రసాద్ గారు.. గోవును బలి ఇవ్వడం, గో సంతతికి చెందిన జంతువులను బలి ఇవ్వడం వేర్వేరు అనే కదా మీ అభిప్రాయం. `పశువులు` చోరీకి గురవుతున్న నేపథ్యంలో గోబలి నిషేధ చట్టం తీసుకువస్తామని హర్యానా ప్రభుత్వం చెబుతోంది. మీరు వేరుగా చూస్తున్నా మతోన్మ
    ాద శక్తులు, హర్యానా ప్రభుత్వం వాటిని వేరుగా చూడడం లేదు.

    ఈ నేపథ్యంలోనే హిందూయేతరులు మాత్రమే గోవధ లేదా పశువధ చేస్తున్నారన్న అపోహను దూరం చేసేందుకే ఈ ఫొటో పెట్టాం

    పశువుల మాంసం హిందూమతంలోనే ఉన్న దళితుల /అణగారిన/ పేద ప్రజల ఆహారమన్న సంగతిని కూడా గుర్తించాలి.

    నిషేధం పేరిట ఆహారపుటలవాట్ల మీద దాడి చేయడం సరికాదు. ఇది హిందూ మతంలోనే ఉన్న దళితులపై మరిన్ని దాడులకూ దారి తీస్తుంది. హర్యానాలో దళితులపై దాడి కోసమే ఈ చట్టం వస్తోందన్న సంగతిని కూడా గమనించాలి.
    Like · Reply · 3 · Commented on by Jagadish Kumar · December 16 at 1:23pm
  • CPIM Telangana కమ్యూనిస్టుల ఉనికి... సిద్ధాంతం.. ఆటుపోట్లు

    వీటి గురించి.... కొంత మంది తెలిసో... తెలియకో మాట్లాడుతున్నట్లున్నారు... కొంత సమాచారం ఇస్తాం... చదవండి..


    1. ప్రపంచ జనాభా 721 కోట్లు... అందులో 152 కోట్ల ప్రజానీకం ప్రత్యక్షంగా కమ్యూనిస్టుల పాలనలో ఉన్నారు. మరో 53 కోట్ల మంది ప్రజానీకం కమ్యూనిస్టు ప్రభావ ప్రభుత్వాల పాలనలో ఉన్నారు. మొత్తం 205కోట్లు. ప్రపంచ జనాభాలో దీని వాటా 28.4శాతం. ఈ రెండు రకాలు కాకుండా ఆయా దేశాల్లోని ఆయా రాష్ర్టాల్లో కమ్యూనిస్టు పాలన కింద ఉన్న ప్రజానీకాన్ని కలుపుకున్నా ప్రపంచ జనాభాలో మూడో వంతు జనాభా కమ్యూనిస్టుల పాలనలో ఉన్నారు. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిజం ఉనికినేం కోల్పోలేదు.

    2. ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఈ రోజు పలు దేశ అధ్యక్షులే కారల్ మార్క్స్ రాసిన `పెట్టుబడి` అనే గ్రంథాన్ని అధ్యయనం చేసేందుకు పూనుకున్నారు. గూగుల్ లో సెర్చి చేయండి. నికోలస్ సర్కోజి మార్క్స్ పెట్టుబడి చదువుతున్న ఫొటోలు కూడా దొరుకుతాయి. దాని గురించి చేసిన కామెంట్లు కూడా కనిపిస్తాయి.

    3. పై రెండు ఉదాహరణలు సిద్ధాంతం ఫెయిల్ కాలేదనేందుకు ఉదాహరణలు

    4. మన భూమి మీద మనిషి ఏర్పడి రెండు లక్షల సంవత్సరాలు అయ్యింది. అందులో లక్ష సంవత్సరాలు ఆదిమ కాలం. 45 నుంచి 60 వేల ఏళ్లు బానిస సమాజం. 30 నుంచి 60వేల ఏళ్ల వరకు భూస్వామ్య సమాజం.. పెట్టుబడిదారీ సమాజం పుట్టి 7 నుంచి 8 వందల ఏళ్లు. కారల్ మార్క్స్ పుట్టి ఇప్పటికి 200 ఏళ్లు.. కమ్యూనిస్టు సిద్ధాంతం పుట్టి 160 ఏళ్లు.. తొలి కమ్యూనిస్టు రాజ్యం ఏర్పడి 97ఏళ్లు... భారతదేశంలో ఒక రాష్ర్టంలో తొలి వామపక్ష ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 57ఏళ్లు... మొత్తం మానవ చరిత్రలోనే ఇంత చిన్న వయస్సున్న కమ్యూనిస్టు సిద్ధాంతానికి ఆటుపోట్లు కచ్చితంగా ఉంటాయి. ఎక్కడో ఓట్లు కోల్పోయినంత మాత్రాన మొత్తం అయిపోయిందని, ఓట్లు వచ్చినంత మాత్రానా మొత్తంగా వచ్చేసిందని అనుకోనక్కర్లేదు.
    Like · Reply · 1 · Commented on by Jagadish Kumar · Yesterday at 8:20am
  • CPIM Telangana మీ అభిప్రాయాలను కూడా చెప్పండి....
    Like · Reply · Commented on by Jagadish Kumar · December 16 at 12:38pm
  • Bharadwaj Namavarapu Vuniki kolpoina communistlu intakanna em matladataaru indulo emi ascharyam vndi
    Siddantam poratam ani matladutunte pani avatle votelu padatle ipudu prajalani mabya pettadanki kotta strategy 
    Mee sidantam prapancham mottam lo utter flop
    • Bheemi Reddy baradwaj namavarapu garu cummunisrula uniki gurinchi matlduthunnaru asalu mee uniki gurinchi meeku thelusa kotlaku kotlu kummarinchi votlu kontunte cummunistulku uniki ela untundhi
    • Bharadwaj Namavarapu Mana desham lo votelu konnaru anukundam mari prapancham lo ekkada chusina communism ledu mari prapancham anta dabbulu gummaristunnara communists ki vyatirekam ga a siddantam flop indi anadanki ussr example
    • CPIM Telangana కమ్యూనిస్టుల ఉనికి... సిద్ధాంతం.. గురించి...

      పాపం.... మీకు తెలిసో... తెలియకో మాట్లాడుతున్నట్లున్నారు... కొంత సమాచారం ఇస్తాం... చదవండి..

      1. ప్రపంచ జనాభా 721 కోట్లు... అందులో 152 కోట్ల ప్రజానీకం ప్రత్యక్షంగా కమ్యూనిస్టుల పాలనలో ఉన్నారు. మరో 53 కోట్ల మంది ప్రజానీకం కమ్యూనిస్టు ప్రభావ ప్రభుత్వాల పాలనలో ఉన్నారు. మొత్తం 205కోట్లు. ప్రపంచ జనాభాలో దీని వాటా 28.4శాతం. ఈ రెండు రకాలు కాకుండా ఆయా దేశాల్లోని ఆయా రాష్ర్టాల్లో కమ్యూనిస్టు పాలన కింద ఉన్న ప్రజానీకాన్ని కలుపుకున్నా ప్రపంచ జనాభాలో మూడో వంతు జనాభా కమ్యూనిస్టుల పాలనలో ఉన్నారు. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిజం ఉనికినేం కోల్పోలేదు.

      2. ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఈ రోజు పలు దేశ అధ్యక్షులే కారల్ మార్క్స్ రాసిన `పెట్టుబడి` అనే గ్రంథాన్ని అధ్యయనం చేసేందుకు పూనుకున్నారు. గూగుల్ లో సెర్చి చేయండి. నికోలస్ సర్కోజి మార్క్స్ పెట్టుబడి చదువుతున్న ఫొటోలు కూడా దొరుకుతాయి. దాని గురించి చేసిన కామెంట్లు కూడా కనిపిస్తాయి.

      3. పై రెండు ఉదాహరణలు సిద్ధాంతం ఫెయిల్ కాలేదనేందుకు ఉదాహరణలు

      4. మన భూమి మీద మనిషి ఏర్పడి రెండు లక్షల సంవత్సరాలు అయ్యింది. అందులో లక్ష సంవత్సరాలు ఆదిమ కాలం. 45 నుంచి 60 వేల ఏళ్లు బానిస సమాజం. 30 నుంచి 60వేల ఏళ్ల వరకు భూస్వామ్య సమాజం.. పెట్టుబడిదారీ సమాజం పుట్టి 7 నుంచి 8 వందల ఏళ్లు. కారల్ మార్క్స్ పుట్టి ఇప్పటికి 200 ఏళ్లు.. కమ్యూనిస్టు సిద్ధాంతం పుట్టి 160 ఏళ్లు.. తొలి కమ్యూనిస్టు రాజ్యం ఏర్పడి 97ఏళ్లు... భారతదేశంలో ఒక రాష్ర్టంలో తొలి వామపక్ష ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 57ఏళ్లు... మొత్తం మానవ చరిత్రలోనే ఇంత చిన్న వయస్సున్న కమ్యూనిస్టు సిద్ధాంతానికి ఆటుపోట్లు కచ్చితంగా ఉంటాయి. ఎక్కడో ఓట్లు కోల్పోయినంత మాత్రాన మొత్తం అయిపోయిందని, ఓట్లు వచ్చినంత మాత్రానా మొత్తంగా వచ్చేసిందని అనుకోనక్కర్లేదు.
      Like · Commented on by Jagadish Kumar · Yesterday at 8:16am
    • Sreekanth Vutukuru Good....kaani China nu accept chestaaraa meeru? manava hakkulu, prajaswamyam levu akkada. Hong kong prastutam raguluthoone undi prajaswamyam kosam...Ekkadaleni saamrajyavadam daani swantham. Russia kuppa koolindigaa. Cuba paristithi emito...mana desaanne theesukundam. West bengal emi baagu padindo communists ke theliyali. Ugravadula addagaa maaripoyindi. Asalu communisam baava jaalaallo thedaa undi..."Naa meeda tax veyyadaniki nuvvu evarraa?"...anna gandhilo viplava veerunni meeru enduku choodaledo...Viplavam ente sutti kodavli kaadu....Viplavam ante prasninchadam.......Adi chesaaru ganuka Gandhi, Mandela, Jesus andaroo viplava veerule.
    • CPIM Telangana చైనా గురించి...

      1. చైనా ఆకాశంలోంచి ఊడిపడిన దేశం కాదు. అద్భుత శక్తులు దానికేం లేవు. ఈ భూ ప్రపంచంపై ఉన్న దేశమే. ఇంతకుముందే చెప్పినట్లు అతి చిన్న వయస్సున్న కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని అది తన పరిస్థితులకు అన్వయించి నడుపుతోంది. అన్వయించడంలో, అర్థం చేసుకోవడంలో సమస్యలుంటాయని మేము ఇంతకు ముందే చెప్పాం.
      2. చైనా గురించి సిపిఐ(ఎం)పార్టీ అంచనా గురించి ఈ వెబ్ లింకును క్లిక్ చేయండి.http://cpim.org/.../resolution-ideological-issues-20th... ఇందులోని ఆరో చాప్టర్ మొత్తం చైనా గురించి పార్టీ ఏమనుకుంటున్నదో సమాచారం ఉంది. చైనా అనుసరిస్తున్న సోషలిస్టు మార్కెట్ ఆర్థిక వ్యవస్థ, దాని నుంచి వచ్చిన పాజిటివ్, నెగిటివ్ ఫలితాల సారాంశం మీకు అందులో కనపడుతుంది. 
      3. ప్రస్తుతం ప్రపంచంలో అంతర్జాతీయంగా ఫైనాన్స్ పెట్టుబడి ఆధిపత్యం నడుస్తోంది. ఫైనాన్స్ పెట్టుబడి అంటే ఇది ఉత్పత్తితో, ఉపాధితో సంబంధం లేకుండా ప్రపంచ దేశాల్లోకి సెకన్లలో వచ్చి, వెళ్లిపోయే పెట్టుబడి. ఇలా వచ్చిపోయే వేదికలు స్టాక్ మార్కెట్లు. లాభాలొస్తాయంటే భారీగా డబ్బులు గుమ్మరిస్తుంది. లాభాలు తగ్గుతాయనుకుంటే భారీగా వెనక్కు లాక్కెళ్తుంది. దీంతో ప్రపంచంలోని అనేక దేశాలు కుప్పకూలిపోయాయి. ఈ రోజు ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఇంత తీవ్ర రూపం దాల్చడానికి కూడా కారణం ఇదే. 
      4. ఫైనాన్స్ పెట్టుబడి ప్రభావం నుంచి, పెట్టుబడిదారీ అభివృద్ధి నమూనాకు దూరంగా ఊహాజనిత ప్రపంచమేదీ చైనా ప్రస్తుత పరిస్థితుల్లో సృష్టించలేదు. చైనానే కాదు ఏ సోషలిస్టు దేశమూ సృష్టించలేదు. ఫైనాన్స్ పెట్టుబడిని ప్రస్తుత రూపంలో ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఇవి ఇంకా సాధించకపోవడమే ప్రధాన కారణం. ఫైనాన్స్ పెట్టుబడి ప్రభావం, పెట్టుబడిదారీ అభివృద్ధి నమూనా అనేవి కచ్చితంగా సమాజంపై దుష్ఫలితాలు చూపిస్తాయి. చైనాలో కూడా ఉన్నాయి. కనిపిస్తున్నాయి. 
      5. ఈ సమస్యలను, తమ దేశ స్థితిగతులకు అన్వయించి సోషలిజాన్ని కాపాడేందుకు ఆయా ప్రభుత్వాలు చేసే ప్రయత్నాలకు సిపిఐ(ఎం) మద్ధతు ఉంటుంది.
      Like · Remove Preview · Commented on by Jagadish Kumar · 4 hours ago
    • CPIM Telangana రష్యా... క్యూబా... పశ్చిమబెంగాల్ గురించి...

      1. రష్యా కుప్పకూలింది. అందులో దాచుకోవాల్సిందేమీ లేదు. అదే సందర్భంగా ప్రపంచంలో మూడో వంతు జనాభా సోషలిస్టు పాలన కింద ఉంది. ఇదీ దాచాల్సిన అవసరం లేదు.

      2. ఈ రోజు ఎబోలా ప్రపంచాన్ని వణికిస్తుంటే దానిని కట్టడి చేసేందుకు క్యూబా తన డాక్టర్లను పంపింది. డబ్బున్న దేశాలు డబ్బులు పంపడంలోనూ మీనమేషాలు లెక్కిస్తుంటే తోటి మనిషిని ప్రేమించాలన్న ఒకే ఒక్క ఆశయంతో, తమ ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినప్పటికీ క్యూబన్ డాక్టర్లు ఎబోలాను గట్టిగా ఎదుర్కొంటున్నారు. ఈ ప్రపంచంలో మానవాళి శ్రేయస్సు కోసం సోషలిస్టు క్యూబా ఏం చేస్తున్నదో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. 

      3. పశ్చిమబెంగాల్... ఇది మొత్తం దేశంలో ఒక రాష్ర్టం. అక్కడ సోషలిజం లేదు. అలాంటి భావనా, ఆలోచనా లేదు. అయితే ఇక్కడి నుంచి సిపిఐ(ఎం)కు చేకూరిన బలం కేంద్రంలో ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉండేది. యుపిఎ-1 ఇందుకు ఉదాహరణ. ప్రజలపై భారాలు పడే ప్రతీ విధానాన్ని సిపిఐ(ఎం) వ్యతిరేకించేది. ఇది పాలకులకు నచ్చలేదు. అందుకే సిపిఐ(ఎం)ను రాజకీయంగా, భౌతికంగా అంతమొందించేందుకు మహాజోత్ పేరిట రావణకాండను సృష్టించారు. ఈ రావణకాండకు ముందుపీఠిన కనపడేది టిఎంసి, వెనుకుండి నడిపించింది కాంగ్రెస్, బిజెపి. భౌతిక దాడులకు సహకరించింది మావోయిస్టులు, భూస్వాములు, వారి గూండాలు. ఈ లింకు చదవండి.http://cpim.org/content/bengal-lf-leaders-memo-cm అక్కడేం జరుగుతున్నదో మీకే అర్థమవుతుంది. ఈ రోజు పశ్చిమబెంగాల్ ను ఉగ్రవాదుల అడ్డాగా మార్చింది టిఎంసి, కాంగ్రెస్, బిజెపి కలిసున్న మహాజోత్ కూటమే.

      4. పశ్చిమబెంగాల్ లో వామపక్షాలు అధికారంలో ఉన్నంత వరకు మత కొట్లాటలు లేవు. మహిళలపై అత్యాచారాల్లో చివరి స్థానంలో ఉండేది. ఇది మేము చెప్పడం లేదు. కేంద్ర హోం శాఖ ప్రకటించిన లెక్కలే ఇవి. ఇప్పుడు బెంగాల్లోకి టిఎంసి తీసుకువచ్చిన బిజెపి మత కొట్లాటలకు ఆజ్యం పోస్తోంది. టిఎంసి గూండాలు రాజకీయ కక్షలకు మహిళలపై అత్యాచారాలను ఒక సాధనంగా వాడుకుంటున్నారు. వీటిని కూడా మీరు గమనించాలి.
      A Left Front delegation met Chief Minister...
      CPIM.ORG
      Like · Remove Preview · Commented on by Jagadish Kumar · 3 hours ago
    • Sreekanth Vutukuru Good sir...China business gurinchi adagatledu. Manava hakkulu emayyayi?? Prajaswamyam emaindi?? Samrajyavaada kanksha daaham eppatiki theeruthundi?? Ivevi China business Ku sambandhinchunavi kaavu. Kevalam siddhanthalaku sambandhunchinavi.. Chinane kaadu...aa desam oodipadindi kaadu. Almost world antha prajaswamyame nadustondi.. Chinaku Unna parimithulanu ardham chesukunna meeru....India Ku Unna parimithulanu gurthinchakapovadam badhakaram
    • CPIM Telangana అవును... విప్లవ వీరులను గుర్తించడంలో మేము కొంత విఫలమయ్యాం. విఫలం అనేకంటే నిర్లక్ష్యం చేశాం. ఇక నుంచి ఆ తప్పు చేయదల్చుకోలేదు.
      Like · Commented on by Jagadish Kumar · 3 hours ago
    • Sreekanth Vutukuru Cuba is fine ok. Wes Bengal communists unnantha varaku baane unte great. Kaani development kooda kadaa kavalsindi. Deeniki thodu, Bangladesh nunchi vachchina chorabatu darulu wbengal lo pathukupoyindi Jyotibasu sarkar hayamline kada....of course Adi inkaa konasaguthondi...
      Unlike · 1 · 3 hours ago · Edited
    • CPIM Telangana
      Write a reply...
  • Panneeru Rakesh orey murkullar,,, america nundi nundi funds thechukoni ekada andharni christains ga convert chestunte mata mathra matladani meeru ...eroju ndhuku ee sollu puranam....paniki vache panulu cheyandi
    • CPIM Telangana 1. మీరు 'అమెరికా నుంచి ఫండ్స్` అని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఒక మతానికి చెందిన సంస్థలు అత్యధికంగా అమెరికా నుంచి ఫండ్స్ తెచ్చుకున్నాయి. ఆ సంస్థలకు మాతృ సంస్థ ఎవరో తెలుసా? ఆర్ ఎస్ ఎస్. ఈ విషయం మేము చెప్పడం లేదు. అమెరికా ప్రభుత్వం, అక్కడ ఈ విషయంపై రీసెర్చి చేసిన సంస్థలే చెబుతున్నాయి. దీని గురించి సమాచారం ఇంటర్నెట్లో బోలెడుంది. చూడండి.
      2. `ఫండ్స్` ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎవరికి వెళ్తున్నాయో, అవి ఏ పనికి ఉపయోగపడుతున్నాయో లెక్కలు తీయాల్సిందే. అయితే అ పని చేయాల్సింది మన కేంద్ర ప్రభుత్వం లేదా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ. సమాచారం దానికే తెలిసే అవకాశం ఉంది కాబట్టి...
      3. ఒక మనిషి ఏ మతాన్ని ఆచరించాలో అది అతని వ్యక్తిగత ఇష్టం. తనకు ఆ హక్కు ఉంది. స్వేచ్ఛ ఉంది. దానిని అడ్డుకోకూడదనే సిపిఐ(ఎం) చెబుతోంది. మత మార్పిడి ఎక్కడైనా జరగొచ్చు. దానిని ఎవరూ ఆపలేరు. ఆపొద్దు కూడా. అయితే అది ఇష్ట పూర్వకంగానా? లేదంటే బలవంతంగానా? అనేవే ప్రశ్నలు. ఆలోచించండి.
      Like · Commented on by Jagadish Kumar · Yesterday at 8:31am
    • Sreekanth Vutukuru Good. RSS christian samstalaku elaa maatru samsta avuthundi??...please furnish the details.......so that all will come to know. Idi challenging gaa anatledu.
    • Panneeru Rakesh mastaru meeru okasari sangareddy odf ane oka estate lo father chanipovadam gani ad vallu amaina problems lo unte kani vallani matalloki dimpi convert chestunnar christans meeru vaste nen vallani parichaya chestanu ....and vallu valla prayer chesukunte baguntadhi but vallu manani and vere religion vallani thittadame prayer ga pettukunnar...cpm meedha oka abhimanam undehi but eppudu ledhu
    • Panneeru Rakesh మరియు మత మార్పిడులు అంటే వేరే మతం నుండి హిందూ మతం లోకి వస్తేనే మర్పిడినా మరి ఇన్ని రోజులుగా హిందూ మతం నుండి వేరే మతాలలోకి జరిగిన మార్పిడిని ఏమంటారు ... మీరు బలి ఇస్తూ పెట్టిన పోస్ట్ లోవున్నాజివి గోవు కాదు సరిగ్గా చూడండీ.... ఇంతకీ మీపోస్ట్ ద్వారా మీరుచెప్పదలచుకొన్నది ఏమిటి
    • CPIM Telangana ఆర్ఎస్ఎస్ క్రైస్తవ సంస్థలకు మాతృ సంస్థనా? అలా ఎక్కడైనా చెప్పామా? లేదంటే ఆర్ఎస్ఎస్ ఎవరికి మాతృసంస్థనో మీకు తెలియక అడుగుతున్నారా? హిందూత్వ, హిందూ మతతత్వ సంస్థలకు అది మాతృసంస్థ. ఈ లింకును చూడండి. ఫండింగ్ వస్తున్న విధానం, వచ్చే రూపాలు, పొందే సంస్థల గురించి కొంత సమాచారం మీకు తెలుస్తుంది.http://www.milligazette.com/Archives/01122002/0112200277.htm
      Like · Commented on by Jagadish Kumar · 3 hours ago
    • CPIM Telangana రాకేష్... మీకు ఇచ్చిన రిప్లయిలోని మూడో పాయింటును మరోసారి చదవండి.
      Like · Commented on by Jagadish Kumar · 3 hours ago
    • CPIM Telangana
      Write a reply...
  • Hari Prasad Pasumarthi ఒక పార్టీ పేరు మీద పెట్టాల్సిన పోస్ట్ కాదు ఇది....... నేను కమ్యునిస్ట్ కుటుంభం నుండి వచ్చిన వాడినే అందుకే పార్టీ పేరుతో మీరు పెట్టిన పోస్ట్ నాకు బాధ కలిగించింది..... దయచేసి ఇలాంటివి పార్టీ పేరుతో పోస్ట్ చేయకండి .
    • CPIM Telangana అవునా??? 

      అయితే కమ్యూనిస్టు ఫేస్ బుక్ పేజీల్లో పెడుతున్న వాటిల్లో మీకు నచ్చిన పోస్టులనైనా మీ టైమ్ లైన్ మీద షేర్ చేయండి. సమాజంలో మంచి కోసం కమ్యూనిస్టులతో కలిసి పని చేయండి.
      Like · Commented on by Jagadish Kumar · December 16 at 2:23pm
    • Hari Prasad Pasumarthi నేనుచాలా షేర్ చేసాను
    • CPIM Telangana please continue this support.
      Like · Commented on by Jagadish Kumar · 3 hours ago
    • CPIM Telangana
      Write a reply...
  • Hari Prasad Pasumarthi మత విషయం లోఇంత భాద పడుతున్న మీరు ఆగస్టు 15 న జెండా వందనం చేయను అని చెప్పిన వాళ్ళ మీద, వందేమాతరం నిగౌరవించను అని బహిరంగంగా చెప్పిన పార్లమెంట్ సభ్యుల గురించి ఎటువంటి పోస్ట్లుపెట్టిషేర్ చేయమని ఎందుకు అడగలేదు...
    • CPIM Telangana దేశమంటే మట్టి కాదోయ్... దేశమంటే మనుషులోయ్ అన్నారు గురజాడ...

      ఈ దేశంలో నివసిస్తున్న ప్రతి మనిషిని మనం ప్రేమించాలి. వందేమాతరం, 15ఆగస్టు జెండా వందనానికే పరిమితమయ్యే ప్రేమకాకూడదు. కుల, మత, ప్రాంత, జాతి బలాల్ని ఉపయోగించి మనిషిని మనిషి దోచుకోవడాన్ని గట్టిగా వ్యతిరేకించేటంత ప్రేమ. ప్రతీ మనిషి స్వేచ్ఛగా బతకాలనుకునేంత ప్రేమ. దానికి అడ్డొచ్చే శృంఖలాలన్నింటినీ చేధించే చైతన్యాన్ని కల్పించేటంత ప్రేమ. దేశభక్తిని కేవలం జెండా వందనానికే సరిపెడదమా? గురజాడ గుర్తు చేసినట్లు మనుషులను ప్రేమిద్దామా?
      ప్రతీ వ్యక్తికి వ్యక్తిగత అభిప్రాయాలుంటాయి. దానిని వేరే వారిపై రుద్దడమే తప్పు. ఆ అభిప్రాయాలు దేశ ప్రజానీకం శ్రేయస్సుకు హాని కలిగించేవిగా ఉంటే అవి మరీ తప్పు. అలాంటివి ఏవి జరిగినా భారతీయులుగా మనం ఉపేక్షించకూడదు. 
      రాముడి అక్రమ సంతనమంటూ సాధ్వీ చేసిన కామెంట్లు, సంస్కృత భాషను మూడో భాషగా రుద్దాలని చేసిన విపరీత కామెంట్లు, మత మార్పిడిపై చేస్తున్న కామెంట్లు, లవ్ జిహాద్ కామెంట్లు.....ఇవన్నీ మనుషుల్ని చీల్చి, లూటీ చేసేందుకు ఉపయోగపడేవే. వీటన్నింటినీ అధికారంలో ఉన్న వారు ప్రేలుతుంటే మనం గట్టిగా ప్రతిఘటించాలా? వద్దా?
      మనం దేశాన్ని ప్రేమించాలి. ప్రేమిస్తున్నాం. దేశాన్ని, భారతీయ రాజ్యాంగాన్ని, దాని పతాకాన్ని ఎవరైనా కించపరిస్తే దానిని గట్టిగా వ్యతిరేకించాలి. దానికి మతం రంగు, ప్రాంతం రంగు పులమకూడదు. అలా అయితే తప్పుదోవ పడుతుంది.
      Like · 2 · Commented on by Jagadish Kumar · December 16 at 2:18pm
    • Hari Prasad Pasumarthi "" ఈ దేశంలో నివసిస్తున్న ప్రతి మనిషిని మనం ప్రేమించాలి. వందేమాతరం, 15ఆగస్టు జెండా వందనానికే పరిమితమయ్యే ప్రేమకాకూడదు. "" ఈ ఒక్కవ్యఖ్యం మీ వైఖరి తెలిపింది ఇంక చాలునేను ఎటువంటి కామెంట్స్ చేయను
    • Sreekanth Vutukuru Dear CPIM telangana, meeru cheppina daanini andaroo patistunnaraa leda ane vishayanni okka saari check chesukondi. Desamante matti kadoi, manushuloy annaru gurajada. kaani aa manishiki thana samskruthi meeda asakthi leni vaadu ayithe athanoka anadha lanti vaade. E desaniki ayina daani samskruthi, charitra moola stambhalu. Communists ku ivevi ardham kaavu. Of course, human rights are very important. Kaani culture kooda important aa. But matham perutho ilaa thirigi muslims ni hindu matham loki aahvaninchadaam thappe. daanni kandistaa. But post meeda naavaipu nunchi ahyatharam undi. Ee post lo meeru cheppindi sagame correct. Ippudu lechina voice vice versa laaga jariginapudu emaindi?? Pedda manasu okalle chesukovaalaa?? Ituvanti "Avagahana" sadassulu okkarikenaa?? Loukikavadam ante emiti??
    • Sreekanth Vutukuru BJP meeda meeru chestunna aaropanalu correcte. Thappu pattanu. Kaani Akbaruddin Hinduvulanu andarinee hathamarustam annappudu voice enduku raise cheyyaledu?? Loukikavadam appudu etupoyindi?? Communism meeda respect tho nenu chestunna comment emitante, communism kante hindu mathathatwame correct. Kaneesam vaaru samskruthini kaapadthaaru. Nizam cheppandi sir.......West bengal lo em sadhinchaaru?? Kerala entha developed o antha radicalized kooda avuthondi gradual gaa. innalla udhyamamlo naxals CRPF, politicians ni champadam minaha sadhinchina pragathi emiti?? Communist siddantha karthalu cheppe prathee daaniki China desam vyathirekam... Prajaswamyam ledu. Manava hakkulu levu. Samrajyavadam ekkuva. Ayina mana communist parties ku India kante China antene makkuva enduko......Finally I say....You are true, but half true. I condemn BJP undertaking the practice of reconvert ion into Hinduism. BJP should stop it immediately.....
    • CPIM Telangana సగం వరకు మీరు మాతో ఏకీభవించారు. బిజెపి అనుసరిస్తున్న విధానాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు ఆనందిస్తున్నాం. మీ తోడ్పాటు కావాలి. 

      ఇకపోతే సంస్కృతి గురించి మీరు ప్రస్తావించారు. సంస్కృతి నిర్వచనం మీ దృష్టిలో ఏమిటి? మన దేశ సంస్కృతి అంటే ఏమిటి? ఒక మత సంస్కృతి యావత్తు దేశ సంస్కృతిగా ఉంటుందా? లేదా కుల సంస్కృతి దేశ సంస్కృతిగా ఉంటుందా? సంస్కృతి ఏమైనా జడ పదార్థమా?
      Like · Commented on by Jagadish Kumar · 3 hours ago
    • Sreekanth Vutukuru Prathi desaniki Oka charitra untundi. Induli prajala kattubatlu, matham, pratyeka jeevana paddati ivanni samskruthilo baagam. Ee desamlo 1300 samvatsarala kindati varaku rendo matham ledu. Ok...ippudu chaala unnayi...parledu. Kaani ikkadi majorities Hinduvulu. Idi America laaga valasa vachinavaari desam kadu. Anti religious ayina communists Ku ivevi ekkakapovadam vinthem kaadu. Nijame...oka matha vidaanam desa vidaanamgaa undakoodadu. Paramatga sahanam, ahimsa ivanni Hindu matha vidanale. Enno mathalu nivasistunna ee desamlo secularism undatam avasarame. Kaani induku asthitwaanni kolpovalsina avasaram ledu. Samskruthi Ni ishtapadani vaariki, ardham kaani variki Adi jadapadhardhame....mana desa asthitwaaniki Hindu mathame moolam. Daanini prasnistam ante maaku communists yokka maddathu, avasaram ledu. Devudu nalugu kulaalanu thayaru cheste vaatini 20 kulakuga marchukundi manam. Venukabadina varini chinna choopu chiodamani devudu cheppale. Adee mana thappe. Daaniki mathaaniki sambandham ledu.
    • CPIM Telangana కొన్ని కరెక్షన్స్...

      1. క్రీస్తు పూర్వం లేదా ఉమ్మడి యుగానికి ముందు (BCE) 2500-1800 మన దేశంలో హరప్పా సంస్కృతి వర్థిల్లింది. BCE 18వ శతాబ్దానికల్లా హరప్పా, మొహంజాదారో అదృశ్యమైపోయాయి.

      2. BCE 1800-1200 వరకు హరప్పా సంస్కృతి తుది దశ. దీనినే ఉప సింధూ సంస్కృతి అని పిలుస్తారు.

      3. BCE 1500 కు కాస్త ముందుగా ఆర్యులు మన దేశంలోకి వచ్చారు. వీరు అలలు అలలుగా మన దేశంలోకి వచ్చారు. రుగ్వేద ఆర్యులది మొదటి అల.

      4. రుగ్వేదం అనేది పాలనకు సంబంధించినది. దీనికి సంహితలు జోడించారు. గానం కోసం రుగ్వేద మంత్రాలకు స్వరాన్ని అమర్చారు. ఈ కొత్త సంకలనం పేరు సామవేదం. పాలన విస్తరించిన కొద్దీ సమాజ విభజన అవసరమైంది. అందుకే సామవేదం పుట్టుకొచ్చింది. ఇది సమాజాన్ని నాలుగు వర్ణాలుగా విభజించింది. అవే బ్రాహ్మణులు, రాజస్యులు (క్షత్రియులు), వైశ్యులు, శూద్రులు.. శూద్రులకు, మిగిలిన వర్ణాలకు మధ్య ఆచరాల్లో స్పష్టమైన గీత గీయడం అప్పటి నుంచే ప్రారంభమైంది. ఇవే కట్టుబాట్ల రూపంలో చెలామణిలోకి వచ్చాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కట్టుబాట్ల మూలం అక్కడ ఉంది.

      5. గుర్రాలు, అధునాతన ఆయుధాలు వాడడం, వారి వ్యవస్థలోనే ఓ తరహా పని విభజన ఆర్యుల జీవనశైలిలో ఉండేది. ఫలితంగా వారు ఏ దేశం వెళ్లినా గెలుస్తూ ఉండేవారు. గెలిచిన వారు, ఓడినవారిపై తమ సంస్కృతిని రుద్డారు. లేదా తాము గీసిన కట్టుబాట్లలో ఓడినవారిని ఉంచారు. ఈ విభజన సమాజంలో ఘర్షణలు రేకెత్తించింది. ఓడిన వారు అన్ని రకాల వృత్తులు చేసేవారు. అందరూ కలిసి ఉండేవారు. ఫలితంగా ఘర్షణ రూపం తీవ్రంగానే ఉండేది.

      6. ఫలితంగానే జైన, బౌద్ధ మతాలు ఆవిర్భవించాయి. ఇవి రెండూ మన దేశంలోనే పుట్టాయి. అవి కూడా BCE కి ముందే ఆ తరువాత కాదు. వ్యవస్థ మీద పోతున్న పట్టును గుర్తించిన బ్రాహ్మణులు వృత్తులను కూడా కులాలుగా విభజించి వాటికీ కట్టుబాట్లను నిర్దేశించారు. కట్టుబాట్లను ఉల్లంఘించిన వారిపై ఎలాంటి శిక్షలను అమలు చేయాలో మనువు ఓ పుస్తకం రాశాడు. దానిపేరు మనుధర్మ శాస్ర్తం. ఇది మన ఇండియన్ పీనల్ కోడ్ లాగా హిందూ పీనల్ కోడ్ అన్నమాట. అంతేకాదు అప్పటి వరకు గో బలిని విచ్చలవిడిగా చేస్తూ, వ్యవసాయ సంపదకు బ్రేకులు వేస్తున్న పాలకులు... జైన, బౌద్ధ మతాల ధాటికి దానిపై నిషేధం విధించుకున్నారు. మరోవైపు కట్టుబాట్లను మతాచారం పేరిట కఠినంగా అమలు చేస్తూ వచ్చారు. మతానికి, కులానికి, కులవివక్షకు విడదీయరాని సంబంధం ఉంది.

      7. మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు సైతం 'పాలనపై అదుపు సంపాదించుకునేందుకు` హిందూ మతం తన సంస్కృతిలో అనేక మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చింది. ఇప్పటికీ ఆ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే దీనికోసం మానవ వికాస అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ప్రతీసారి రాతియుగం, ఇనుపయుగానికి మనల్ని మళ్లిస్తున్నారు. చరిత్ర చక్రగమనం ఎప్పుడూ ముందుకే వెళ్లాలి కానీ వెనక్కు కాదు. గతం నుంచి గుణపాఠాలు తీసుకోవాలి కానీ అనుకరించకూడదు. సైన్సు కంటే జ్యోతిష్యం గొప్పదని చెప్పడం, మతం ఆధారంగా భారతదేశ చరిత్ర రచనకు పూనుకోవడం ఇందులో భాగమే...
      Like · Commented on by Jagadish Kumar · 12 minutes ago
    • CPIM Telangana
      Write a reply...
  • Hari Prasad Pasumarthi మతం లోకి వస్తే డబ్బులు ఇస్తాము అని పామ్ప్లేట్ లు పంచి మరీ మత మార్పిడులు చేసే వాళ్ళు మీకుకనిపించటం లేదా..... నేనుఅడిగింది మీరు CPIM పేరు. పెట్టుకొని గోవధ ని ఎందుకు ఈపోస్ట్ లోకి తెచ్చారు అని , పశు సంపదని హిందువులు కూడా చంపుతున్నారు అనే పదం కిఅర్ధం మీరుహిందూయేతర మతాలకి వత్తాసు పలకటం కోసమే వాడారా? గోవులు తినే దళితలు మీకుఎక్కడ కనిపించారు అండీ మరి పందుల పెంపకం కాని వాటినితినటాన్ని కాని నిషేదించాలి అని కోరుకొనే మతాలు కూడా దళితులనే టార్గెట్ చేశాయా? .
    • CPIM Telangana తేడా అర్థం కావట్లేదన్నమాట!!!

      అభిప్రాయం `చెప్పడానికి`... అభిప్రాయం `రుద్దడానికి' మధ్య తేడాను తెలుసుకునేందుకు ప్రయత్నించండి. మీకే అర్థమవుతుంది. సమాధానం అందులోనే లభిస్తుంది.
      Like · 1 · Commented on by Jagadish Kumar · December 16 at 2:33pm
    • CPIM Telangana
      Write a reply...
  • Hari Prasad Pasumarthi భలవంతం ప్రలోభ పెట్టి మత మార్పిడి చేసారు అని ఎవరు అయినా మతం మారిన వాళ్ళు కాని వాళ్ళ బందువులు కాని కంప్లైంట్ చేసారా?
    • CPIM Telangana బలవంతపు మత మార్పిడులు జరుగుతున్న ప్రాంతాల్లో అంత ధైర్యం చేయనిస్తున్నారా?
      Like · Commented on by Jagadish Kumar · December 16 at 2:33pm
    • CPIM Telangana
      Write a reply...
  • CPIM Telangana అత్యధిక మందికి ఈ విషయాన్ని షేర్ చేయండి....
    Like · Reply · Commented on by Jagadish Kumar · December 16 at 12:36pm
  • Hari Prasad Pasumarthi క్రిస్మాస్ సెలవలు రద్దు అని ఎవరు చెప్పారు .. మరియు మత మార్పిడులు అంటే వేరే మతం నుండి హిందూ మతం లోకి వస్తేనే మర్పిడినా మరి ఇన్ని రోజులుగా హిందూ మతం నుండి వేరే మతాలలోకి జరిగిన మార్పిడిని ఏమంటారు ... మీరు బలి ఇస్తూ పెట్టిన పోస్ట్ లోవున్నాజివి గోవు కాదు సరిగ్గా చూడండీ.... ఇంతకీ మీపోస్ట్ ద్వారా మీరుచెప్పదలచుకొన్నది ఏమిటి
  • Khayyum Pasha that is dyfi
  • Bharadwaj Namavarapu For your information many of communist leaders are brahmins are they controlling communist parties also ?? 
    Edinaa ante mundu venaka chusi reasearch chesi chepali edo chepeyadam kaadu
  • Sreekanth Vutukuru Also, I strictly criticize your comments that brahmins are controlling the religion. tell us how could you come to this conclusion.....

1 comment:

  1. ఇక్కడ కొంతమంది కామెంట్లు చూస్తుంటే బాదేస్తుంది. ఇన్నాళ్లు మాతమార్పిడీలు జరుగుతుంటే మాట్లాడని వారు ఇప్పుడేందుకు మాట్లాడుతున్నారు? అని కొంతమంది అడ్డగోలు వాదనకు దిగుతున్నారు. మరి ఇన్నాళ్లు వాళ్లు ఏం చేశారో మాత్రం చెప్పరు. మతం అనేది వ్యక్తిగత ఇష్టం. కమ్యూనిస్టులు ఎప్పుడూ మతస్వేచ్ఛను అడ్డుకున్న సందర్భాలూ లేవు. అది ఏ మతమైనా. కనీసం ఇంట్లో ఇల్లాలు అభిప్రాయాలను సైతం గౌరవిస్తారు. అయితే ఇప్పుడే ఈ చర్చ ఎందుకు జరుగుతుందన్న కనీస జ్నానం ఒక్కడ కొంతమంది అజ్నానులకు ఎందుకు అర్థం కావడంలేదో తెలియడంలేదు. కేవలం హిందూ ఉన్మాది అయినంత మాత్రాన గాంధీజీని చంపిన గాడ్సేను దేశభక్తుడని చాటేందుకు అధికారంలోకి వచ్చిన బిజెపి అనుబంధ సంస్థలు చాపకింద నీరులా తమ ప్రయత్నాలను ప్రారంభించాయి. ఇది ఇక్కడి కుహానా మేధావులు ఎలా సమర్ధించుకుంటారో వారే చెప్పాలి. ప్రభుత్వం కొన్ని మతాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం.. మతం ఎజెండాతో పనిచేయడాన్ని మాత్రమే సిపిఎం తప్పబడుతోెంది. విఛ్చిన్నమైన సోవియట్ యూనియన్ లో ఇప్పుడు చాలా చిన్న చిన్న దేశాలు మళ్లీ కమ్యూనిజం వైపు చూస్తున్నాయి. లాటిన్ అమెరికాలో చాలా దేశాల్లో కమ్యూనిస్టుల ప్రాభల్యం పెరుగుతోంది. ప్రజాస్వామ్య విలువలను, ప్రజాతంత్రవాదాన్ని ఎంతోకొంత కాపాడుతుంది కమ్యూనిస్టు ప్రభుత్వాలే. అంతేందుకు ఏదో జరుగుతుంది అని యావత్ దేశాన్ని తప్పుదోవ పట్టించి.. బెంగాల్ లో వామపక్ష ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా కూల్చివేయడంలో టిఎంసీకి ఆయుధంగా మారిన కిషన్ జీ.. ఎందుకు మమత అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు? ఒకవేళ వామపక్ష ప్రభుత్వం అందరూ ఆరోపించినట్లు వ్యవహరించేదే అయితే.. కిషన్ జీ ని ఎందుకు టార్గెట్ చేయలేదు?.. ఇలాంటి విషయాలను కులంకుషంగా చర్చిస్తే వామపక్షాల విలువ అర్థం అవుతుంది.

    ReplyDelete