Saturday, 30 August 2014

Monday, 11 August 2014

మత ఘర్షణలు, విద్యా కాషాయీకరణ... ఇదే మోడీ ప్రభుత్వ తక్షణ కర్తవ్యం...



నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో మతఘర్షణలు పెచ్చరిల్లుతున్నాయి. ఇప్పటివరకు గుజరాత్, కర్ణాటక, హర్యానా, మహారాష్ట్ర వంటి అనేక రాష్ట్రాల్లో మత ఘర్షణలు జరిగాయి. ఉత్తర ప్రదేశ్ లో అన్నిటికన్నా ఎక్కువగా ఈ ఘర్షణలు చెలరేగాయి. ఇటువంటి ఘటనలను ఉపయోగించుకుని రాజకీయంగా లబ్ది పొందాలని బిజెపి ఆరెస్సెస్ లు చూస్తున్నాయి. మోరాదాబాద్ లో మహిళపై దాడులకు కూడా మత పరమైన రంగు పులిమి ఉద్రేకాలు రెచ్చగొడుతున్నారు. బిజెపి విజయగర్వంతో వ్యవహరిస్తోంది. మైనార్టీలే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఉధృతంగా మతతత్వ ప్రచారం చేసింది. విశ్వహిందూ పరిషత్ తదితర సంస్థలు తమ కార్యకలాపాలను ఉధృతం చేస్తున్నాయి. శాస్త్రీయ విద్యను అందించాల్సింది పోయి, విద్యా కాషాయికరణ కోసం కసరత్తులు చేస్తున్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠ్య పుస్తకాలను తిరగరాసేందుకు పూనుకున్నారు. విద్యా వ్యవస్థలో మతతత్వం జొప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దేశంలో మతతత్వ శక్తుల ప్రభావాన్ని, కార్యక్రమాలను తిప్పికొట్టేందుకు రాజకీయ సైద్ధాంతిక కృషి ఇంకా పెరగాలి. మతతత్వం, విద్యా కాషాయీకరణను వ్యతిరేకిస్తూ అన్ని లౌకిక ప్రజాతంత్ర శక్తులను కలుపుకుని సీపీఎం నిరంతరం పోరాడుతుంది

ఇజ్రాయిల్ దాడులు అమానుషం


గాజాలో ఇజ్రాయిల్ దాడులను సీపీఎం ఖండిస్తోంది. ఈ దుర్మార్గ దాడిని విరమించడంతో పాటు గాజాపై ఆంక్షలను, దిగ్భంధాన్ని ఎత్తివేయాలని ఇజ్రాయిల్ ను డిమాండ్ చేసింది. పార్లమెంటులో ఈ విషయమై చర్చ వచ్చినపుడు ఇజ్రాయిల్ దాడిని విస్పష్టంగా ఖండించేందుకు బిజెపి ప్రభుత్వం నిరాకరించడాన్ని సీపీఎం తీవ్రంగా విమర్శించింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, శాంతి కాముక దేశం అయిన భారత దేశం హింసను ఖండించకపోవడం దురదృష్టకరం

మోడీ పాలనలో మహిళలకు రక్షణ కరువు..!



స్త్రీని గౌరవించే దేశం మనదని ప్రగల్భాలు పలుకుతున్న ఎన్డీయే ప్రభుత్వం ఆ మహిళా మూర్తుల రక్షణ గురించి పట్టించుకోకపోవడం శోచనీయం. మహిళలు, పిల్లలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నా సరైన చర్యలు చేపట్టడం లేదు. దేశంలో అనేక చోట్ల ఈ ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. బెంగుళురులో పాఠశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘటన లాంటి దుర్మార్గాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. నిందితులను వెంటనే అరెస్టు చేసి విచారణ జరిపించడంలో పోలీసులు, ప్రభుత్వాలు ఘోరంగా విఫలమౌతున్నాయి. దేశోద్ధారకులమని చెప్పుకునే నేతలు.. అధికార పక్షంలో ఉండి చేస్తున్న దారుణ, అభ్యంతరకర వ్యాఖ్యానాలు వింటే సిగ్గనిపిస్తోంది. ఇటీవల మధ్య ప్రదేశ్ లో ఇద్దరు బిజెపి మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. 'సిపిఎం మహిళలపై అత్యాచారాలు చేయండి' అంటూ టిఎంసి ఎంపి తపస్ పాల్ చేసిన ప్రకటన అత్యంత ఖండనార్హం. ఇలాంటి నిందితున్ని శిక్షించి పార్లమెంటునుంచి సస్పెండ్ చేయాలి. ఇందుకు బదులుగా లజ్జా రహితమైన టిఎంసి ప్రభుత్వం ప్రజా ధనంతో ఆయనను సమర్థిస్తున్నది. ఆ ఘనుడిపై ఎఫ్ఐఆర్ కు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీలు చేసింది. మహిళలపై హీనమైన వ్యాఖ్యలు చేసే సభ్యులకు సంబంధించి ఒక ప్రవర్తనా నియమావళిని పార్లమెంటు ఆమోదించడం చాలా అవసరమని సిపిఎం కేంద్ర కమిటీ కోరింది. స్త్రీలకు రక్షణ కల్పించలేని దుర్భర స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందని సిపిఎం కేంద్ర కమిటీ ఆందోళన ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఎఫ్ డీ ఐ లకు ఎర్రతివాచి


కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యుపిఎ ప్రభుత్వం అవలంబించిన నయా ఉదారవాద విధానాలు కొనసాగించడమే గాక మరింత వాటిని ఉదృతం చేస్తోంది. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఎఫ్ డీ ఐలను వ్యతిరేకించిన బీజేపీ, అధికారంలోకి రాగానే రైల్వేలలోఎఫ్ డిఐల ప్రవేశం, రక్షణ, బీమా రంగాల్లో 49 శాతం ఎఫ్ డిఐ వంటి నిర్ణయాలను తీసుకొచ్చింది. పిపిపి పేరిట ప్రజావనరులను ఫణంగా పెట్టి బడా పెట్టుబడిదారులకు మరిన్ని అవకాశాలు కల్పిస్తోంది. పన్ను సర్దుబాట్లు విదేశీ పెట్టుబడిదారులకు ఉన్నత వర్గాలకే ఉపయోగపడేలా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సామాన్య ప్రజలకు ఉపయోగపడే పథకాలపై వ్యయాన్ని కుదించింది. ఇక బడ్జెట్ లో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులే లేవు. ప్రభుత్వ విద్యా, వైద్య రంగాలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇంధన సబ్సిడీలో తీవ్రంగా కోతవిధిస్తోంది. పీపీపీల పేరుతో కార్పొరేట్లకు ఎర్రతివాచి పరిచే అభివృద్దే దేశాభివృద్ధిగా చెబుతున్న బీజేపీ సామాన్యులపై భారాలు మోపుతోంది. మోడీ ప్రభుత్వం అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు సీపీఎం రాజీలేని పోరాటం చేస్తుంది. ప్రజాపోరాటాలలో కలిసొచ్చే అన్ని శక్తులను కలుపుకుని పోరాటాలను మరింత ఉధృతం చేయనుంది.    

భూసేకరణ చట్టం - భూ భకాసురుల చుట్టం


యూపీఏ ప్రభుత్వం 2013 లో ఆమోదించిన భూ సేకరణ పునరావాసం - నష్టపరిహారం పారదర్శకత చట్టానికి మార్పులు తేనుంది. కార్పొరేట్లకు మేలు చేకూర్చేందుకు చట్టానికి తూట్లు పొడిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని సిపిఎం తేటతెల్లం చేసింది. పీపీపీ పథకాల కింద భూమి సేకరించేప్పుడు 80 శాతం రైతులు ఆమోదించాలని ఉంది. యాభై శాతం రైతులు ఆమోదిస్తే చాలంటూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇది సన్న, చిన్నకారు రైతులకు, దానిపై ఆధారపడిన వారికి నష్టం కలిగిస్తుంది. ఈ భూదోపిడీని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనిపై రాజీలేని పోరాటం చేస్తుంది.

మోడీ పాలన దేశానికి ప్రమాదం

నరేంద్ర మోడీ పాలన దేశానికి హానికరమని గత రెండున్నర నెలల కాలంలో జరిగిన సంఘటనలు తార్కాణంగా నిలుస్తున్నాయిమోడీ ప్రభుత్వం వేగంగా ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేయడానికి తహతహలాడుతోంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర నెలల కాలంలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉందన్న ధీమాతో ఆర్ఎస్ఎస్ అనేక ఘర్షణలను రాజేస్తోంది. రానున్న కాలంలో ఇవి మరింత పెరగనున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. బిజెపి మత కలహాలు, వైషమ్యాల ఆధారంగా దేశవ్యాప్తంగా విస్తరించాలని ప్రయత్నించడం ఆందోళనకరం. ఈ కలహాలతో బిజెపి బలపడటం అటుంచితే, భారతదేశం బలహీనమవ్వడం మాత్రం ఖాయం. ఈ పరిణామాల నేపథ్యంలో దేశంలోని లౌకిక శక్తులన్నీ మతోన్మాదానికి వ్యతిరేకంగా ఏకమై ముందుకు రావాలి. రక్షణ ఇన్సూరెన్స్, రైల్వే రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర దుష్ఫలితాలు చూపనుంది. పేదలకు అంతోఇంతో అండగా నిలుస్తోన్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గత ఏడాది ఈ పథకానికి 32 వేల కోట్లు కేటాయించగా, గత అప్పులను మినహాయించి ఈ ఏడాది ఎన్డీయే కేవలం 26 వేల కోట్లే కేటాయించింది. పెరిగిన ధరలతో పోల్చితే ఇవి మరింత తక్కువ కేటాయింపులే. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలి.   

కార్మిక చట్టాలు నిర్వీర్యం చేసేందుకు కుట్ర..


కార్మిక చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కార్మిక సంఘాల స్థాపన, పారిశ్రామిక వివాదాలు, కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించిన చట్టాలను సవరించడం ద్వారా కార్మిక హక్కులపై దాడిని ఉదృతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కార్మికుల తొలగింపుకు ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన పరిమితిని 100 మంది కార్మికుల నుండి నుంచి 300 కు పెంచాలని యోచిస్తుంది. కార్మిక సంఘాల ఏర్పాటుకు ఏడుగురు ఉండాలన్న పరిమితిని మొత్తం కార్మికుల్లో 30 శాతంగా మారుస్తున్నారు. 20 మంది లోపు కార్మికులుండే సంస్థలు ఫ్యాక్టరీస్ యాక్టు పరిధిలోనికి లోనికి రావన్న నిబంధనను 40 మంది కార్మికుల వరకూ పెంచుతున్నారు. బిజెపి పాలిత రాజస్థాన్ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను కంపెనీల నుంచి పొమ్మనకుండా పొగబెట్టె విధానాలకు వత్తాసు పలకడానికి అనువైన అన్ని చర్యలు తీసుకుంది. కార్మిక హక్కులను పూర్తిగా కాలరాసేందుకు మోడీ ప్రభుత్వం చూస్తోంది.

కార్మిక చట్టాలలో బిజెపి ప్రభుత్వం తెస్తున్న మార్పులు, కార్మికులు ఉద్యోగులకు మేలు చేసేవిగా కాకుండా పెట్టుబడిదారులకు ఉపయోగపడేలా ఉన్నాయి. కార్మికుల భద్రత తగ్గించేందుకు, ఇష్టానుసారంగా తొలగించేందుకు ఈ మార్పులు దోహదపడతాయి. ఈ చట్టాలతో కార్మికులకు కష్టాలు తప్పవు. ఈ కుట్రలను తిప్పికొట్టాలంటే, కార్మిక సంఘాలు వామపక్ష ప్రజాతంత్ర పార్టీలూ ఉమ్మడిగా ప్రతిఘటన చేయాలి. ప్రభుత్వ నిర్ణయాలపై జాతీయ కార్మిక సంఘాలు దేశ వ్యాప్త పోరాటానికి నిర్ణయించాయి. ఈ పోరాటానికి సీపీఎం పార్టీ సంపూర్ణ మద్ధతునిస్తుంది

Thursday, 7 August 2014

10 వామపక్ష పార్టీల సమావేశం నిర్ణయాలు - కార్యాచరణ


తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా జరిగిన 10 వామపక్ష పార్టీల సమావేశం ఫలప్రదంగా జరిగింది. వామపక్ష ఐక్యత కోరుకునే శ్రేయాభిలాషులు, అభిమానుల ఆకాంక్షలను అందుకునే విధంగా చర్చలు జరిగాయి. సుహృద్భావ వాతావరణంలో జరిగిన ఈ సమావేశంలో రాజకీయ పరిస్థితిపై చర్చించడంతో పాటు, భవిష్యత్తు కార్యాచరణను కూడా నిర్ణయించాయి.

ఇవీ 10 వామపక్ష పార్టీల సంయుక్త భవిష్యత్తు కార్యాచరణ అంశాలు...


1. ఈ నెల 15లోపు గానీ, 15 తరువాత గానీ, లేదా ముఖ్యమంత్రి కెసిఆర్ అపాయింట్ మెంట్ ఎప్పుడు దొరికితే అప్పుడు 10 వామపక్ష పార్టీలు సంయుక్తంగా మెమోరాండంను సమర్పిస్తాయి. రాష్ట్రంలో ఎదుర్కొంటున్న పలు సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తాయి.
2. ఈనెల 24న బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'దళితులు- భూ సమస్య` అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు జరుగుతుంది. ఇందులో 10 వామపక్ష పార్టీలు, సామాజిక శక్తులు పాల్గొంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని దళితులు ఈ సదస్సుకు హాజరు కావాలి.
3. ఆగస్టు 28న విద్యుత్ అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని వామపక్ష పార్టీలు జరుపుతాయి. ఉదయం పూట అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పిస్తాయి. మధ్యాహ్నం తరువాత ప్రెస్ మీట్ పెట్టి 10వామపక్ష పార్టీల సంయుక్త డిక్లరేషన్ ను ప్రకటిస్తాయి. ఇందులో వివిధ సమస్యలపట్ల వామపక్షాల వైఖరి, భవిష్యత్తు కార్యాచరణను ఇందులో ప్రకటించనున్నాయి.

#10leftparties#Telangana#CPI(M), #CPI, #Daliths#Landissue#KCR ,#TelanganaCM#Landreforms

10 వామపక్ష పార్టీలు ప్రెస్ మీట్ నిర్వహించాయి... వాటి వివరాలు ఇవి....

10 వామపక్ష పార్టీల ప్రెస్ మీట్ జరిగింది. మధ్యాహ్నం వరకు చర్చించిన అంశాల గురించి ఇందులో వివరించారు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర రాజకీయాల గురించి సమావేశంలో చర్చ జరిగింది. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
1. పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడిని వామపక్ష పార్టీలు ఖండించాయి. ఇజ్రాయిల్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, పాలస్తీనాకు సంఘీభావంగా త్వరలో కార్యాచరణ ప్రకటించనున్నాయి.
2. మోడీ ప్రభుత్వం తిరోగామి విధానాలను అవలంభిస్తోంది. రక్షణ రంగంలో 49శాతం ఎఫ్ డిఐలకు పచ్చజెండా ఊపింది. ఇది దేశ భద్రతకు సవాలుగా పరిణమిస్తుంది. లాభాలొస్తున్న రైల్వేలోనూ మౌలిక సదుపాయాల రంగంలో 100శాతం ఎఫ్ డి ఐని అనుమతించింది. మరో వైపు మత ఉద్రిక్తతలనూ పెంచుతోంది.
3. రాష్ట్రంలో కెసిఆర్ చేస్తున్న ప్రకటనలకు ఆచరణకు పొంతన లేదనే అభిప్రాయానికి వామపక్ష పార్టీలు వచ్చాయి.
4. దళితుల భూములు : దళితులకు మూడెకరాల చొప్పున భూములు కేటాయిస్తామంటే అందరూ సంతోషించాం. పథకం ప్రకటించిన తరువాత దానిని అమలు చేయాలనే సంకల్పం, భూ పంపిణీ కోసం సేకరణ జాడ ఎక్కడా కనిపించడం లేదు. ఏడాదికి వెయ్యికోట్ల చొప్పున దీనికి కేటాయిస్తామని కెసిఆర్ చెప్పారు. ఇలా అయితే 30ఏళ్ల వరకు కూడా దళితులకు భూములు పంచలేరు.
5. విద్యుత్ సమస్య : తన చేతిలో ఏమీ లేదని కెసిఆర్ చెబుతున్నారు. కొరత ఉన్నప్పుడు పొరుగున ఉన్న రాష్ర్టాల నుంచి కొనుగోలు చేయాలి. మూడేళ్ల వరకూ కోతలుంటాయని ముందే చెప్పానంటే అప్పటి దాకా చిన్న, సన్నకారు రైతుల పరిస్థితి ఏంటి? కాబట్టి తక్షణం విద్యుత్తును కొనుగోలు చేసి కొరత లేకుండా చూడాలి.
6. కాంట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణ : దీని గురించి స్పష్టంగా ప్రకటించినప్పటికీ నిర్దిష్ట చర్యలు లేవు. దురదృష్టవశాత్తు నిరుద్యోగులు లేదా ప్రభుత్వ ఉద్యోగ ఆశావాహులు, సహ ఉద్యోగులకు ఈ క్రమబద్దీకరణ విషయంలో విభేధాలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకూడదు. క్రమబద్దీకరణ సందర్భంగా పాటించాల్సిన అన్ని రూల్లును పాటిస్తూనే, కొందరిలో వచ్చిన అనుమానాలను కూడా నివృత్తి చేయాలి.
7.ఫీజు రీయింబర్స్ మెంట్ : 1956కంటే ముందు నుంచి ఉన్నవారినే స్థానికులనడం కరెక్టు కాదు. ఆ తరువాత ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పరుచుకున్నవారున్నారు. 'ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడూ తెలంగాణా వాడే` అని కెసిఆర్ ఎన్నికలకు ముందు చెప్పారు. ఆ మాటకు కట్టుబడి ఉండాలి. అలాకాకుండా, కేవలం పాక్షిక దృష్టితో మాత్రమే ముందుకు పోతే మరిన్ని విభేధాలకు ఆస్కారం కల్పించబడుతుంది.
8.వనరుల దోపిడీ : ఒక ప్రాంతం వనరులను మరొక ప్రాంతం దోచుకుంటే అది తప్పు. అయితే వనరుల పంపిణీ విషయంలో దేశంలో ఉన్న అన్ని రాష్ర్టాలు సమన్వయంతో, సామరస్యంతో వ్యవహరించినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇదే స్ఫూర్తిని తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు కూడా తీసుకోవాలి. ఈ స్ఫూర్తితో సామరస్యంగా వ్యవహరించాలి.
9. ఈ నెల 19 సర్వే : ఆరు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా కేవలం ఒకే ఒక్క రోజులో సర్వే పూర్తి చేయాలని టి.సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. బోగస్ ను ఏరివేసేందుకే అని సర్కారు చెబుతోంది. ఉన్నవాటిని ఏరివేసి, సంస్కరణలను వేగంగా అమలు చేసేందుకు ఈ సర్వే జరుగుతోందన్న అనుమానం ఉంది. అయితే దీని గురించి ఆచరణలోనే చూడాల్సి ఉంటుంది.

#10leftparties #Telangana #israel #palestine #daliths #narendramodi #KCR#Feereimbursement #19thsurvey #FDI #powercrisis #CPI(M) #CPI

Wednesday, 6 August 2014

తెలంగాణా రాష్ట్రంలోని పది వామపక్ష పార్టీల చారిత్రక సమావేశం ప్రారంభం

కొద్ది సేపటి క్రితమే సిపిఐ(ఎం) తెలంగాణా రాష్ట్ర కార్యాలయంలో, తెలంగాణాలో పనిచేస్తున్న పది వామపక్ష పార్టీల చారిత్రక సమావేశం ప్రారంభమైంది. వాటికి సంబంధించిన ఫొటోలివి.
ఇందులో ఇప్పటికే వచ్చి పాల్గొన్నవారు....
1. తమ్మినేని వీరభద్రం, సిపిఐ(ఎం) తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి, కార్యదర్శి వర్గ సభ్యులు చెరుపల్లి సీతారాములు (మాజీ ఎమ్మెల్సీ), సారంపల్లి మల్లారెడ్డి
2. చాడా వెంకటరెడ్డి, సిపిఐ తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి, పార్టీ నాయకులు సిద్ది వెంకటేశ్వర్లు
3. గోవర్దన్, సిపిఐ(ఎంఎల్)న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి, కార్యదర్శి వర్గ సభ్యులు పి.సూర్యం, వేముల పల్లి వెంకట్రామయ్య
4.విజయకుమార్, సిపిఐ(ఎంఎల్) కార్యదర్శి
5. ఎస్ యు సిఐ (సి) నుంచి తెలంగాణా, ఆంధ్ర రాష్ట్ర కమిటీల సభ్యులు సిహెచ్ మురహరి
6. ఎంసిపిఐ(యు) నుంచి ఎండి గౌస్, వి.ఉపేందర్ రెడ్డి
7. జానకి రాములు, ఆర్ ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి, హైదరాబాద్ కార్యదర్శి ఆర్.గోవింద్
8. బండా సురేందర్ రెడ్డి, ఫార్వార్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి




వామపక్ష పార్టీల సంయుక్త సమావేశం


ప్రభుత్వం వ్యవసాయ రుణాలు వెంటనే పంపిణీ చేయాలి..