నరేంద్ర
మోడీ ప్రభుత్వం అధికారంలోకి
వచ్చాక దేశంలో మతఘర్షణలు
పెచ్చరిల్లుతున్నాయి.
ఇప్పటివరకు
గుజరాత్, కర్ణాటక,
హర్యానా,
మహారాష్ట్ర
వంటి అనేక రాష్ట్రాల్లో మత
ఘర్షణలు జరిగాయి. ఉత్తర
ప్రదేశ్ లో అన్నిటికన్నా
ఎక్కువగా ఈ ఘర్షణలు చెలరేగాయి.
ఇటువంటి ఘటనలను
ఉపయోగించుకుని రాజకీయంగా
లబ్ది పొందాలని బిజెపి ఆరెస్సెస్
లు చూస్తున్నాయి. మోరాదాబాద్
లో మహిళపై దాడులకు కూడా మత
పరమైన రంగు పులిమి ఉద్రేకాలు
రెచ్చగొడుతున్నారు.
బిజెపి
విజయగర్వంతో వ్యవహరిస్తోంది.
మైనార్టీలే
లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి.
ఎన్నికల
ప్రచారంలో బీజేపీ ఉధృతంగా
మతతత్వ ప్రచారం చేసింది.
విశ్వహిందూ
పరిషత్ తదితర సంస్థలు తమ
కార్యకలాపాలను ఉధృతం చేస్తున్నాయి.
శాస్త్రీయ
విద్యను అందించాల్సింది
పోయి, విద్యా
కాషాయికరణ కోసం కసరత్తులు
చేస్తున్నారు. బిజెపి
అధికారంలోకి వచ్చిన తర్వాత
పాఠ్య పుస్తకాలను తిరగరాసేందుకు
పూనుకున్నారు. విద్యా
వ్యవస్థలో మతతత్వం జొప్పించేందుకు
ప్రయత్నాలు ప్రారంభించింది.
దేశంలో మతతత్వ
శక్తుల ప్రభావాన్ని,
కార్యక్రమాలను
తిప్పికొట్టేందుకు రాజకీయ
సైద్ధాంతిక కృషి ఇంకా పెరగాలి.
మతతత్వం,
విద్యా
కాషాయీకరణను వ్యతిరేకిస్తూ
అన్ని లౌకిక ప్రజాతంత్ర
శక్తులను కలుపుకుని సీపీఎం
నిరంతరం పోరాడుతుంది.
No comments:
Post a Comment