తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా జరిగిన 10 వామపక్ష పార్టీల సమావేశం ఫలప్రదంగా జరిగింది. వామపక్ష ఐక్యత కోరుకునే శ్రేయాభిలాషులు, అభిమానుల ఆకాంక్షలను అందుకునే విధంగా చర్చలు జరిగాయి. సుహృద్భావ వాతావరణంలో జరిగిన ఈ సమావేశంలో రాజకీయ పరిస్థితిపై చర్చించడంతో పాటు, భవిష్యత్తు కార్యాచరణను కూడా నిర్ణయించాయి.
ఇవీ 10 వామపక్ష పార్టీల సంయుక్త భవిష్యత్తు కార్యాచరణ అంశాలు...
1. ఈ నెల 15లోపు గానీ, 15 తరువాత గానీ, లేదా ముఖ్యమంత్రి కెసిఆర్ అపాయింట్ మెంట్ ఎప్పుడు దొరికితే అప్పుడు 10 వామపక్ష పార్టీలు సంయుక్తంగా మెమోరాండంను సమర్పిస్తాయి. రాష్ట్రంలో ఎదుర్కొంటున్న పలు సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తాయి.
2. ఈనెల 24న బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'దళితులు- భూ సమస్య` అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు జరుగుతుంది. ఇందులో 10 వామపక్ష పార్టీలు, సామాజిక శక్తులు పాల్గొంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని దళితులు ఈ సదస్సుకు హాజరు కావాలి.
3. ఆగస్టు 28న విద్యుత్ అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని వామపక్ష పార్టీలు జరుపుతాయి. ఉదయం పూట అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పిస్తాయి. మధ్యాహ్నం తరువాత ప్రెస్ మీట్ పెట్టి 10వామపక్ష పార్టీల సంయుక్త డిక్లరేషన్ ను ప్రకటిస్తాయి. ఇందులో వివిధ సమస్యలపట్ల వామపక్షాల వైఖరి, భవిష్యత్తు కార్యాచరణను ఇందులో ప్రకటించనున్నాయి.
#10leftparties, #Telangana, #CPI(M), #CPI, #Daliths, #Landissue, #KCR ,#TelanganaCM, #Landreforms
No comments:
Post a Comment