Monday, 11 August 2014

మోడీ పాలన దేశానికి ప్రమాదం

నరేంద్ర మోడీ పాలన దేశానికి హానికరమని గత రెండున్నర నెలల కాలంలో జరిగిన సంఘటనలు తార్కాణంగా నిలుస్తున్నాయిమోడీ ప్రభుత్వం వేగంగా ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేయడానికి తహతహలాడుతోంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర నెలల కాలంలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉందన్న ధీమాతో ఆర్ఎస్ఎస్ అనేక ఘర్షణలను రాజేస్తోంది. రానున్న కాలంలో ఇవి మరింత పెరగనున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. బిజెపి మత కలహాలు, వైషమ్యాల ఆధారంగా దేశవ్యాప్తంగా విస్తరించాలని ప్రయత్నించడం ఆందోళనకరం. ఈ కలహాలతో బిజెపి బలపడటం అటుంచితే, భారతదేశం బలహీనమవ్వడం మాత్రం ఖాయం. ఈ పరిణామాల నేపథ్యంలో దేశంలోని లౌకిక శక్తులన్నీ మతోన్మాదానికి వ్యతిరేకంగా ఏకమై ముందుకు రావాలి. రక్షణ ఇన్సూరెన్స్, రైల్వే రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర దుష్ఫలితాలు చూపనుంది. పేదలకు అంతోఇంతో అండగా నిలుస్తోన్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గత ఏడాది ఈ పథకానికి 32 వేల కోట్లు కేటాయించగా, గత అప్పులను మినహాయించి ఈ ఏడాది ఎన్డీయే కేవలం 26 వేల కోట్లే కేటాయించింది. పెరిగిన ధరలతో పోల్చితే ఇవి మరింత తక్కువ కేటాయింపులే. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలి.   

No comments:

Post a Comment