Monday, 11 August 2014

కార్మిక చట్టాలు నిర్వీర్యం చేసేందుకు కుట్ర..


కార్మిక చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కార్మిక సంఘాల స్థాపన, పారిశ్రామిక వివాదాలు, కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించిన చట్టాలను సవరించడం ద్వారా కార్మిక హక్కులపై దాడిని ఉదృతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కార్మికుల తొలగింపుకు ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన పరిమితిని 100 మంది కార్మికుల నుండి నుంచి 300 కు పెంచాలని యోచిస్తుంది. కార్మిక సంఘాల ఏర్పాటుకు ఏడుగురు ఉండాలన్న పరిమితిని మొత్తం కార్మికుల్లో 30 శాతంగా మారుస్తున్నారు. 20 మంది లోపు కార్మికులుండే సంస్థలు ఫ్యాక్టరీస్ యాక్టు పరిధిలోనికి లోనికి రావన్న నిబంధనను 40 మంది కార్మికుల వరకూ పెంచుతున్నారు. బిజెపి పాలిత రాజస్థాన్ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను కంపెనీల నుంచి పొమ్మనకుండా పొగబెట్టె విధానాలకు వత్తాసు పలకడానికి అనువైన అన్ని చర్యలు తీసుకుంది. కార్మిక హక్కులను పూర్తిగా కాలరాసేందుకు మోడీ ప్రభుత్వం చూస్తోంది.

కార్మిక చట్టాలలో బిజెపి ప్రభుత్వం తెస్తున్న మార్పులు, కార్మికులు ఉద్యోగులకు మేలు చేసేవిగా కాకుండా పెట్టుబడిదారులకు ఉపయోగపడేలా ఉన్నాయి. కార్మికుల భద్రత తగ్గించేందుకు, ఇష్టానుసారంగా తొలగించేందుకు ఈ మార్పులు దోహదపడతాయి. ఈ చట్టాలతో కార్మికులకు కష్టాలు తప్పవు. ఈ కుట్రలను తిప్పికొట్టాలంటే, కార్మిక సంఘాలు వామపక్ష ప్రజాతంత్ర పార్టీలూ ఉమ్మడిగా ప్రతిఘటన చేయాలి. ప్రభుత్వ నిర్ణయాలపై జాతీయ కార్మిక సంఘాలు దేశ వ్యాప్త పోరాటానికి నిర్ణయించాయి. ఈ పోరాటానికి సీపీఎం పార్టీ సంపూర్ణ మద్ధతునిస్తుంది

No comments:

Post a Comment