Monday, 11 August 2014

మోడీ పాలనలో మహిళలకు రక్షణ కరువు..!



స్త్రీని గౌరవించే దేశం మనదని ప్రగల్భాలు పలుకుతున్న ఎన్డీయే ప్రభుత్వం ఆ మహిళా మూర్తుల రక్షణ గురించి పట్టించుకోకపోవడం శోచనీయం. మహిళలు, పిల్లలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నా సరైన చర్యలు చేపట్టడం లేదు. దేశంలో అనేక చోట్ల ఈ ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. బెంగుళురులో పాఠశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘటన లాంటి దుర్మార్గాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. నిందితులను వెంటనే అరెస్టు చేసి విచారణ జరిపించడంలో పోలీసులు, ప్రభుత్వాలు ఘోరంగా విఫలమౌతున్నాయి. దేశోద్ధారకులమని చెప్పుకునే నేతలు.. అధికార పక్షంలో ఉండి చేస్తున్న దారుణ, అభ్యంతరకర వ్యాఖ్యానాలు వింటే సిగ్గనిపిస్తోంది. ఇటీవల మధ్య ప్రదేశ్ లో ఇద్దరు బిజెపి మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. 'సిపిఎం మహిళలపై అత్యాచారాలు చేయండి' అంటూ టిఎంసి ఎంపి తపస్ పాల్ చేసిన ప్రకటన అత్యంత ఖండనార్హం. ఇలాంటి నిందితున్ని శిక్షించి పార్లమెంటునుంచి సస్పెండ్ చేయాలి. ఇందుకు బదులుగా లజ్జా రహితమైన టిఎంసి ప్రభుత్వం ప్రజా ధనంతో ఆయనను సమర్థిస్తున్నది. ఆ ఘనుడిపై ఎఫ్ఐఆర్ కు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీలు చేసింది. మహిళలపై హీనమైన వ్యాఖ్యలు చేసే సభ్యులకు సంబంధించి ఒక ప్రవర్తనా నియమావళిని పార్లమెంటు ఆమోదించడం చాలా అవసరమని సిపిఎం కేంద్ర కమిటీ కోరింది. స్త్రీలకు రక్షణ కల్పించలేని దుర్భర స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందని సిపిఎం కేంద్ర కమిటీ ఆందోళన ఆందోళన వ్యక్తం చేస్తోంది.

No comments:

Post a Comment