Thursday 1 January 2015

మహా సభల ప్రచారం షురూ...




       
         సిపిఐ(యం) తెలంగాణ తొలి రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను ఈ రోజు (జనవరి 1)న రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో గోడలకు అతికించారు.  ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సిపిఐ(ఎం) రాష్ట్ర మహాసభలు 2015 ఫిబ్రవరి 26 నుండి మార్చి 1 వరకు హైదరాబాదులో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సెమినార్లు, సదస్సులు, గోష్టులు, ఎగ్జిబిషన్లు జరుగుతాయి. మార్చి 1న నిజాం కాలేజీ గ్రౌండ్‌లో రెండు లక్షల మందితో ర్యాలీ-సభ జరుగుతుంది. రాష్ట్ర మహాసభలు, ప్రజా ఉద్యమాలకు ఉదారంగా విరాళాలివ్వాలని, మహాసభలను విజయవంతం చేయాలని తమ్మినేని విజ్ఞప్తి చేసారు.

        ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు పి రాజారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు డిజి నర్సింహారావు, బి వెంకట్‌, కె. గోపాల్‌, జె వెంకటేష్‌, బండారు రవికుమార్‌, ఆర్‌ సుధాభాస్కర్‌ - హైదరాబాదు పార్టీ కార్యదర్శులు ఎం శ్రీనివాస్‌, ఎన్‌ సోమయ్య, కె రవి - ప్రజాసంఘాల నాయకులు బి సాంభశివ, పాలడుగు భాస్కర్‌, రమ తదితరులు పాల్గొన్నారు.

1 comment:

  1. మతతత్వ శక్తులు విజృంభిస్తున్న నేటి రాజకీయ రంగంపై ఒక నిబద్ధత గల కమ్యూనిస్ట్ పార్టీ ఆవశ్యకత ఉన్నది. ఈ పాత్ర సీపీఎం పోషించాలని ఆశిస్తున్నాం.

    ప్రజలకూ, రాజకీయ పార్టీలకూ మధ్య వారధులుగా మేధావులు పోషించే పాత్రను సీపీఎం విస్మరించకూడదు. ప్రజల రాజకీయ, సామాజిక అవసరాలను మొదట గుర్తించేది మేధావి వర్గమే! ప్రజలతో మమేకమై ఉండే మేధావివర్గం నుంచి పార్టీ inputs స్వీకరించాలి. తద్వారా ప్రజల అవసరాలను గుర్తించి వాటిపై వెంటనే పనిచెయ్యగల adaptability పార్టీకి వస్తుంది. ఈ దిశగా సీపీఎం కృషి చెయ్యాలి.

    ReplyDelete