Wednesday, 28 January 2015

తెలం`గానాలు`- ప్రచార గీతాలు....... సిపిఐ(ఎం) తెలంగాణా తొలి మహాసభల పాటలు మీకోసం




మీకోసం తెలం`గానాలు` సిద్ధమయ్యాయి. మంగళవారం నాడు జరిగిన ప్రెస్ మీట్ లో సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్యదర్శి వర్గ సభ్యులు సారంపల్లి మల్లారెడ్డిగారు వీటిని ఆవిష్కరించారు.

ఈ కింద ఉన్న టేబుల్ లో పాట పేరు మీద క్లిక్ చేస్తే యూ ట్యూబ్ ద్వారా ఒక్కో పాటను వినొచ్చు...  వినండి.. పాడండి.. ప్రచారం చేయండి..


పాటరచన గానం
1.గోలుకొండ అదిరేలా కొట్టాలి డప్పు కె.దేవేంద్ర రాంకి
2. ఇంటికొక్క మనిషి ఊరికొక్క బండి ప్రభాకర్ ఎ.ప్రసాద్
3. భాగ్యనగరం ముస్తాబయిందిరో ఎస్.కె.జమీల్  పాషా అరూరి కుమార్
4. ఎంతకాలం మిట్ల  మోసపోకు కన్నెగంటి వెంకటయ్య లెనినా
5. తెలంగాణ గానం సాంబరాజు యాదగిరి కాంపాటి  శ్రీను
6. మందారమ ఓ మందారమా ఎ.భాస్కర్ వి.సదానంద్
7. చెట్టు  పేరు చెప్పి భగత్ సింగ్ పి.వెంకట్ రెడ్డి
8. మట్టి బిడ్డడు మాయమౌతుండే చింతల యాదగిరి చింతల యాదగిరి
9. ఉడికిందని తెలిపేందుకు పోతగాని వి.సదానంద్


 కొన్ని పాటలు డౌన్  లోడ్ చేసుకోవచ్చు.. రింగ్ టోన్లుగా సైతం పెట్టుకోవచ్చు. ఈ కింద ఉన్న వాక్యాన్ని క్లిక్ చేయండి.

Sunday, 25 January 2015

యుద్దోన్మాది అమెరికాకు భారత్ ఇక అధికారిక జూనియర్ భాగస్వామి... ఉమ్మడి ప్రకటన సారాంశమిది... ఈ ప్రకటన మన దేశ ప్రజానీకానికి నష్టం.. ప్రపంచానికి రాంగ్ సిగ్నల్...





-----`ఇక చర్చించాల్సిన అంశాలేమీ లేవ్. కేవలం కాంట్రాక్టులు కుదుర్చుకోవడమే మిగిలింది`... ఒబామా, మోడీ నేతృత్వంలో ఇరు దేశాల ప్రతినిధుల బృందం చర్చ పూర్తి అయ్యిందో లేదో పిఎంఓ నుంచి మీడియాకు అందిన లీక్ ఇది.  దీంతో కార్పొరేట్ మీడియా `నమో`స్తే ఒబామా.... అంటూ హోరెత్తించేసింది. అసలు లోపల చర్చ ఏం జరిగింది? అందులో వివరాలేంటి అనేది ఇంకా ఎవ్వరికీ తెలియదు. యుద్దోన్మాది, ఇతర దేశాల సార్వభౌమాధికారాలను కూల్చడంలో `బిజీ`గా ఉన్న అమెరికా అధ్యక్షుడితో చర్చల్లో అన్ని అంశాలు క్లియర్ అయిపోయాయని లీక్ వచ్చిందంటే ఎవరికి ఎవరు లొంగిపోయారో అప్పుడే తెలిసిపోయింది. మోడీ, ఒబామా బయటకు వచ్చిన తరువాత ఇరువురు తమ చర్చల సారాంశాన్ని వివరించారు. తెరవెనుక జరిగిన అనేక విషయాలను దాచారు.

----తెర ముందుకు వచ్చి వారిద్దరు మాట్లాడిన దాని సారాంశం ఏమిటంటే యుద్దోన్మాది అమెరికాకు భారత్ ఇక అధికారిక జూనియర్ భాగస్వామిగా మారిపోయింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అమెరికా చేపట్టే ఆపరేషన్స్ లో భారత్ భాగస్వామి కాబోతోంది. తద్వారా తన చేతికి రక్తం అంటించుకునే పని భారత్ చేయబోతోంది. గణతంత్ర దినోత్సవం నాడు దేశానికి అతిథిగా ఆహ్వానించి, సార్వభౌమాధికార దేశాలను కూల్చే పనిలో అమెరికాకు తోడుగా నిలబడేందుకు అంగీకరించడం ప్రపంచానికే రాంగ్ సిగ్నల్. అణు పరిహారం, డిఫెన్స్ రంగాల్లో కుదిరిన ఒప్పందాల వివరాలు దేశ ప్రజానీకానికి తెలియాల్సి ఉంది. ఎందుకంటే అవి దేశ ప్రజల ప్రాణాల భద్రతతో ముడిపడిన అంశాలు కాబట్టి.. అయితే వీటిని తెరవెనుక దాచి పెట్టారు. మన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అనేక అగ్రీమెంట్లు ఈ రెండు రోజుల్లో కుదరబోతున్నాయి. ఈ మేరకు ఓ ప్రత్యేక వ్యవస్థ కూడా ఏర్పాటు కాబోతోంది. ఇప్పటి వరకున్న పరిణామాలు, ఇప్పుడున్న దూకుడు చూస్తుంటే ఇవి  మన దేశ ప్రజానీకం ప్రాణాలు, వారి ఆస్తులకు ఎలాంటి రక్షణను హామీనిచ్చేట్లు కనిపించడం లేదు. 


ఒబామా- మోడీ ప్రసంగంలో వచ్చిన అంశాలు - అర్థం చేసుకోవాల్సిన కోణం...


1. అణు ఒప్పందం అడుగు ముందుకు వేయబోతోంది. పిఎంఓ సోర్సు ప్రకారం ఇక ఇష్యూస్ ఏమీ లేవు కేవలం కాంట్రాక్టులు మాత్రమే మిగిలాయట.. ఇదే రెండు దేశాల మధ్య సంబంధాలకు సెంటర్ పీస్ గా ఉంది. చట్టం, న్యాయవ్యవస్థ, కమర్షియల్ వయబిలిటీ వంటి వాటన్నింటికీ లోబడి ఈ డీల్ ముందుకు వెళ్ల బోతోందని మోడీ చెప్పాడు. దీనర్థం ఏంటి? వీరిద్దరు అణు పరిహారం గురించి మాట్లాడలేదు. పిఎంఓ మాత్రం ఏ ఇష్యూస్ లేవంటోంది. అంటే వాళ్లు అణు పరిహారం ఇవ్వడానికి ఓకే అన్నారా? లేదా భారత్ నే ఒప్పంచారా? ట్రాకింగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. దేశ ప్రజలకు వాస్తవాలు తెలియాలి.

2. ఇన్నాళ్లూ అంతర్జాతీయ సామ్రాజ్యవాద పూరిత యుద్ధాలకు భారత్ దూరంగా ఉంది. ఇప్పుడు అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఆసియా, పసిఫిక్ మహా సముద్రాల్లో భారత్ సహకరించబోతోందని మోడీ చెప్పారు. దీనర్థం ఏమిటి? మన సైన్యం ఇతర దేశాలపై దాడులకు వెళ్లబోతోందా? అమెరికా చేసే రక్తపాత క్రీడలో మన దేశం పాలుపంచుకోబోతోందా? శాంతి కాముక దేశం, అందులోని దేశ ప్రజానీకానికి వాస్తవాలు తెలియాలి.

3. అమెరికాకు జూనియర్ భాగస్వామిగా మారినందుకు సెక్యురిటీ కౌన్సిల్ లో శాశ్వత సభ్యత్వం ఇస్తానని చెప్పిందా? అదే అయితే మన దేశ పాలకులు తప్పు చేసినట్లే లెక్క.. మారిన ప్రపంచ నిర్మాణాన్ని అనుసరించి భద్రతా కౌన్సిల్ ను విస్తరించాలన్నది డిమాండ్ గా ఉంది. ఆ డిమాండ్ లో భారత్ కు కచ్చితంగా శాశ్వత సభ్యత్వం దక్కాలి. అది ఎవరి దయాదాక్షిణ్యాలు అక్కర్లేదు. లేదా ఇదో ఎర అంశంగా మారకూడదు. పై రెండు పాయింట్లు చూసినప్పుడు అమెరికా చెప్పినట్లు వినడం ద్వారా దీనిని సాధించుకున్నామనే భావన కలుగుతోంది. ఇది యావత్తు ప్రపంచానికే నష్టం.

4. పర్యావరణ ఒప్పందానికి డెడ్ లాక్ ఇన్నాళ్లు వేస్తూ వచ్చింది ఎవరు? ధనిక దేశాలు అందులోనూ ముఖ్యంగా అమెరికా... గత రెండు సమావేశాల్లో అమెరికా మెడలు వంచేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తుంటే భారత పాలకులు వేసిన అడుగులు అనుమానాలు పెంచేవిగా ఉన్నాయి. దీనిని అర్థం చేసుకోవాలంటే ఈ అంశానికి సంబంధించిన రెండు విషయాలను అర్థం చేసుకోవాలి. అమెరికా తన కాలుష్య ఉద్ఘారాలను 2050 నాటికి గతంలో ప్రకటించిన మేరకు తగ్గించాల్సి ఉంటుంది. అయితే మూడో ప్రపంచ దేశాలు ముందుగా తగ్గించాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది. దీనిని కంపల్సరీ చేయాలని చెబుతోంది. అంతేకాదు ఇన్నాళ్లూ ఈ భూమి మీదకు కాలుష్యాన్ని వదిలిన అమెరికా దానికి నష్ట పరిహారంగా పచ్చదనాన్ని పెంచేందుకు నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. దానిని కూడా తప్పించుకోవాలని చూసింది. ఈ అంశాలపై అమెరికా, భారత్ వైఖరులేంటో ప్రపంచానికి తెలియాలి. భావి భారతానికి, లేదా భావి ప్రపంచానికి ఈ రెండు దేశాలు న్యాయ, సమంజస మార్గాన్ని సూచిస్తున్నాయా? లేదంటే అమెరికా ఆడమన్నట్లు భారత్ ఆడబోతోందా? చూడాల్సి ఉంది.

5. టెర్రరిజం గురించి... టెర్రరిజాన్ని అంతమొందించడానికి అన్ని దేశాలు ప్రయత్నించాలి. అందులో అనుమానం లేదు. అయితే దాని పేరిట భద్రతా అంశాలను అమెరికా వాడికి అప్పచేప్పే ప్రయత్నం జరుగుతోంది. ఇద్దరు దేశాధినేతల మధ్య హాట్ లైన్లు ఉండొచ్చు. సంబంధాలు అలాగే ఉండాలి. సెక్యూరిటీ చీఫ్ ల మధ్య సైతం హాట్ లైన్లు ఉంటాయట. ఇరువురు తమ దేశ భద్రతకు సంబంధించిన సమాచారం ఇచ్చి పుచ్చుకుంటారట. ఇది కూడా మంచిదే. భారత, అమెరికా సైన్యాలు (నావీ, ఎయిర్, పదాతిదళం) సంయుక్త విన్యాసాలు చేస్తాయని, వీటి మధ్య కూడా సంబంధాలు ఉంటాయని చెబుతున్నారు. దీన్నెలా చూడాలి? జి7 దేశాల్లో ఉన్న జర్మనీ పెసిడెంట్ మెర్కల్ మీదనే నిఘా వేసిన చరిత్ర అమెరికాది. ఈ రోజు ప్రపంచంలో ఉన్న సార్వభౌమాధికార దేశాలను తన వ్యాపార ప్రయోజనాలకోసం కబళిస్తున్నది అమెరికా. నిన్నటి దాకా దోస్తుగా ఉండి, అమెరికా చెప్పినట్లు ఆడకపోతే ప్రభుత్వాలను, దాని అధినేతలను ఆయా దేశాల్లో సంక్షోభాలు సృష్టించి కూల్చేస్తున్నది అమెరికా. ఇప్పుడు టెర్రరిజం సాకుతో భారత్ చేస్తున్న పని మన భద్రతను అమెరికా చేతిలో పెడుతోంది. భవిష్యత్తును చూస్తానంటోంది. మనం గతాన్ని కూడా చూడాలని చెప్పాలి.

6. కెమిస్ర్టీ.. ఫిజిక్స్ ల గురించి... : ఇద్దరు దేశాధినేతలు తెర వెనుక ఏం మాట్లాడుకుంటారో అది ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ఇద్దరు దేశాధినేతలు ఇరు దేశాలకు ప్రతినిధులు. ప్రజలు వాళ్లను ఎన్నుకున్నారు. కెమిస్ర్టీ, ఫిజిక్సులు ఏమైనా ఉంటే అది వ్యక్తిగతంగా ఉంచుకోవాలి. మొన్నటి దాకా గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో విసానే ఇవ్వనిరాకరించిన దశ నుంచి ఇంత వేగంగా కెమిస్ర్టీ ఎలా డెవలప్ అయ్యింది? దీనికి గల కారణాలేంటి? ప్రజలకు తెలియాలి. భారత్ ను తక్షణం జూనియర్ భాగస్వామిగా చేసుకోవాలన్న తహతహనా? లేదా అమెరికాకు తక్షణం జూనియర్ భాగస్వామిగా మారిపోవాలన్న భారత్ తహతహనా? ఈ తహతహ వల్ల ఏర్పడ్డ కెమిస్ర్టీ వల్ల లాభపడేదెవరు? ఇది కూడా ప్రజలకు తెలియాలి.

7. దౌత్యపరమైన అంశాలు ప్రపంచ శాంతి, ప్రపంచ కాలుష్యం తదితర అంశాలపై ప్రభావం చూపుతాయి. మన దేశం మీద నేరుగా ప్రభావం చూపేవి వేరే అంశాలున్నాయి. దీనికోసం ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేస్తారట. ఇందులో ఎవరుంటారో తెలుసా? ఆయా దేశాల్లోని బడా కార్పొరేట్లు, వీరికి పర్మీషన్లను సమకూర్చే ఇరు దేశాల అధికారులు. ఇరు దేశాల్లో వీరెంచుకున్న రంగాల్లో వ్యాపారాలు చేయాలంటే అంతకు ముందు ప్రభుత్వ రక్షణలో ఉన్న అనేక రంగాలు, సంస్థలు మార్కెట్ పరం చేయాలి. దీనర్థం ఏమిటి? ప్రయివేటీకరించాలి. ప్రభుత్వం తప్పుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయాలి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకుద్దేశించిన కనీస రక్షణలు తీసేయాలి. వీరి వ్యాపారం నిరాటంకంగా సాగాలంటే ఇవి తప్పవు. ఇవి అనివార్యం అవుతాయి.  దీనివల్ల ఏం జరుగుతుంది. ఆర్థికంగా చిన్న, మధ్య తరహా వ్యాపారులు, పరిశ్రమలు, ఇప్పటికే సంక్షోభంలో ఉన్న మన జనం మరింత చితికిపోతారు. ఇరు దేశాల్లో ఉన్న బడా కొర్పరేట్లు లాభ పడతారు. వారి వద్ద సంపద మరింత పోగుపడుతుంది.

Thursday, 22 January 2015

ఒబామా గో బ్యాక్ అనేది ఈ దేశ ప్రయోజనం కోసమే.... : తమ్మినేని షేర్ చేసిన పోస్టుపై `ఆలోచన లోచన`లో చర్చ

---- ఒబామా గో బ్యాక్ అని వామపక్షాలు పిలుపునిచ్చాయి. 24న నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి. వామపక్షాలు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమాల మీద అనేక మందికి అనేక అనుమానాలున్నాయి.
----- ఒబామా గో బ్యాక్ అంటూ సిపిఐ(ఎం) పార్టీ తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు `ఆలోచన లోచన` అనే గ్రూపులో షేర్ చేసిన పోస్టుపై ఈ అనుమానాలతోనే ఓ చర్చ ప్రారంభమైంది. వీటిని నివృత్తి చేసే దిశగా చర్చ సాగింది.
----ఇది మొత్తం చదివిన తరువాత కూడా అనుమానాలు  ఇంకా మిగిలి ఉండొచ్చు.. వాటిని మనస్సులో ఉంచుకోకుండా చర్చకు పెట్టడం ఉపయోగం.

‪#‎ObamaGoBack‬ ‪#‎LeftParties‬ ‪#‎CPIM‬ ‪#‎Prakashkarath‬
నరేంద్ర మోడీ అత్యంత సాదరంగా ఒబామాను ఆహ్వానిస్తున్నారు. దీనిని కేవలం అంతర్జాతీయ వ్యవహారంలా చూడొచ్చు కదా? వామపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఎందుకు వ్యతిరేకించాలి?
------ఇదీ జవాబు--- ఒబామా గణతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి వస్తున్నారు. గణతంత్ర దినోత్సవం అంటే దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చి ప్రజలకు హక్కులు దఖలుపడిన రోజు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ప్రజలపై దాడులు జరిపి వారి హక్కులను కబళిస్తున్న అమెరికా అధ్యక్షుడిని గణతంత్ర ఉత్సవానికి అతిథిగా ఆహ్వానించడం సబబు కాదు. ఆయన కారణంగానే ఇరాక్, లిబియా వంటి దేశాల్లో యుద్ధ జ్వాలలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. మరోవైపు సిరియాలో ప్రజలెన్నుకున్న స్వతంత్ర ప్రభుత్వాన్ని కూల దోశాడు. ఇలా ప్రపంచ దేశాల సార్వభౌమాధికారాన్ని ధ్వంసం చేసే పనిలో బిజీగా ఉన్న అమెరికా అధ్యక్షుడు మన దేశ గణతంత్ర దినోత్సవాలకు హాజరు కావడం ద్వారా ప్రపంచానికే రాంగ్ సిగ్నల్ ఇచ్చినట్లవుతుంది.
----- రెండో కారణం---- ఒబామా కేవలం అతిథిగా వచ్చినా పై కారణం చేత మనం వ్యతిరేకించాలి. అయితే ఆయన కేవలం అతిథిగా రావడం లేదు. ఆయన భారీ ఎజెండాతో వస్తున్నారు. భారతదేశాన్ని తన రక్షణ వ్యూహంలో భాగస్వామిగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అదే జరిగితే మన సైన్యంలోనూ అమెరికా జోక్యం పెరుగుతోంది. అణు ప్రమాదాల నష్ట పరిహారాన్ని ఎత్తివేసేందుకు వీలుగా ఒక ఒప్పందం జరగబోతోంది. జపాన్ లో ఫుకుషిమా ప్రమాదాన్ని చూశాం. అలాంటి ప్రమాదాల వల్ల భారతీయులకు నష్టం జరిగితే నష్ట పరిహారం భారాన్నుంచి అమెరికన్ కంపెనీలను తప్పించే ఒప్పందం అది. యూనియన్ కార్బైడ్ విషయంలో మనం ఇప్పటికే నష్టపోయాం. ఇకనుంచి కనీసం నష్ట పరిహారం కూడా అడిగేందుకు వీలు లేకుండా పోనుంది.
-----మూడో కారణం--- ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో అమెరికన్ కంపెనీలకు, దేశీయ బడా పెట్టుబడిదారులకు లబ్ది చేకూర్చే అనేక ఒప్పందాల కోసం మోడీ ప్రభుత్వం రాత్రింబవళ్లు అహర్నిశలు కృషి చేస్తోంది. ఇందుకోసం ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టబోతోంది. దీనిలో భాగంగానే దేశ ప్రజలెనుకున్న పార్లమెంటుతో సంబంధం లేకుండా, అక్కడ చర్చించకుండా ఆర్డినెన్సుల రూపంలో చట్టాలను మార్పుచేస్తోంది. రైతన్నలను భూములనుంచి గెంటివేసే భూ సేకరణ చట్టం సవరణ ఆర్డినెన్స్ ఇందుకు ఒక ఉదాహరణ...
--- ప్రపంచానికి, దేశానికి, దేశ ప్రజల ప్రయోజనాలకు నష్టం కలిగించే దిశగా ఒబామా పర్యటన ఉండబోతోంది. అందుకే వామపక్షాలు ఈ పర్యటనను వ్యతిరేకిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 24న నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నాయి.
‪#‎ObamaGoBack‬ ‪#‎LeftParties‬ ‪#‎CPIM‬ ‪#‎Prakashkarath‬
నరేంద్ర మోడీ అత్యంత సాదరంగా ఒబామాను ఆహ్వానిస్తున్నారు. దీనిని కేవలం అంతర్జాతీయ వ్యవహారంలా చూడొచ్చు కద...
See More
Like ·  · 
  • Murthy Raghunath some times intelligent people acts like stupids. he is one of them.. no more comments....35 samhatsarala charitra thudichepettuku poyindhhi bengal lo... better he needs to think Bengal.. that is enough.
  • హైందవ బహుజన్ meeku tappulu cheyadam sorry cheppadam alaavaatu...iuntha kante goppagaa poraatam cheyaleru
  • Om Kiran  failed leftist.. .. not sure if this guy is more closed to leftists, liberals than right wing.. 
  • Murthy Raghunath yes .. completely failed... no more trust. if, you search their records for past 10 years. you can find more.... పాతకాలపు మనుషులుగా ఉండిపోయారు....
  • Sree Sri has karat, yechuri or anyone else said anything abt russian invasion of ukraine, chechanya or else where...pffffft
  • Bunny Sunny అయ్యా శ్రీ గారు ...మేము చేస్తే...శృంగారం అదిఅమెరిక వాడు చేస్తే వ్యభిచారం...ఇది కొంత మంది తీరు...ఇంత కన్నా చెప్పేది ఏముంది?
    19 hrs · Like · 2
  • Cumar Chennam అమెరికా సామ్రాజ్యవాద విధానం ఇక్కడ ఉన్న సిపిఎం పార్టీ ఎక్కడ ఆచరించింది, కొంచెం వివరించగలరు Bunny Sunny గారు....పాకిస్థాను కి ఉగ్రవాదం తగ్గించినందుకు 150 కోట్ల డాలర్లు సహాయమందించిన ఒబామా గారు ఈ దేశానికి చేసే ఉపయోగం ఏముందండి..?
    18 hrs · Like · 1
  • Cumar Chennam వారు వ్యతిరేకించారు కాబట్టి మనం సమర్ధిద్దాం అని కాకుండా, ఆయన రాక ఏరకంగా ఉపయోగం అని ఆలోచించండి..? రక్షణ రంగం లో ఆయనతో కలిసి పనిచేయాల్సిన అవసరం మనకుందా..?
    18 hrs · Like · 2
  • Sree Sri obama coming to india is beneficial or not is something totally different and i woldnt want to get into it... i just wanted to know if these very people who are talking abt america usurping sovereignty of nations, have the same stand when it comes to russia?? i dont remember any of these guys condemning the russian involvement in ukraine, chechanya or for that matter even during the serbian issue
    18 hrs · Like
  • Cumar Chennam పైన పోస్ట్ ఒబామా భారత పర్యటన గురించి....మిగతా దేశాలకు ఆయన వెళ్ళినప్పుడు కారత్ ఖండించలేదు, వాటి గురించి మాట్లాడలేదు...ఉక్రెయిను రష్యా గురించి కూడా కారత్ ప్రత్యేకంగా మాట్లాడాలని అనుకోవద్దు..ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలలో 700 సైనిక స్థావరాలు ఆక్రమించుకొన్న అమెరికాకి మిగతా దేశాలకి చాలా తేడా ఉంది...ఇంకో విషయం, సిపిఎం పార్టీ ఇప్పుడు రష్యాని చైనా ని కమ్యునిస్ట్ దేశాలుగా పరిగిణించట్లేదు...ప్రపంచమంతా రష్యా కమ్యునిస్ట్స్, చైనా కమ్యునిస్ట్స్ గా విడిపోయినప్పుడు కూడా ఎవ్వరికి మద్దతు ఇవ్వలేదు, ఆ పంధా ఇక్కడ కొనసాగించం అని కూడా చెప్పారు.
    18 hrs · Like · 1
  • Sree Sri " ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ప్రజలపై దాడులు జరిపి వారి హక్కులను కబళిస్తున్న అమెరికా " ani rasaru kada...russia ade pani chesi nappuddu khandicha ledenti ani adiga.. anthe
    17 hrs · Like · 2
  • రంగారావు గారి అబ్బాయి నాని Sree sri gaaru.. i feel a little uncomfortable while you people are supporting america and its capitalistic strategies which loot Indian resources, just for the sake of confrinting Indian communists as they support Russia.. it nt sounds like a meaning less argument
    17 hrs · Like · 1
  • రంగారావు గారి అబ్బాయి నాని american corporations are totally depending on the world human resources.. these the human resouces and its output can be attained at cheaper rates in third world countries where the employement rate is low.. and as the developing nation India conventrated on quality technical education but could not provide similar employment opportunities that can suit technos.. American corporates wanted to use this condition... 
    As the biggest financial lenders of american economy are none other but their corporates.. it should act according to their interests.. and 
    more over the healthy association with India can help in halting the pace of China also.. who is effectively utilizkng its resources for self development.. another angle of his visit may be of the security pacts.. i dont have much knowledge about it.. can anybody please correct me and add with some more points
    17 hrs · Edited · Like · 1
  • Bunny Sunny అమెరిక చేసింది...చెడు..మరి రష్యా చేసింది...ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం..చాలా బాగా సమర్దించారు...cumar chennam గారు...నా మొదటి కామెంట్ నిజమని మరోసారి నిరూపించారు..గ్రేట్..
    17 hrs · Like
  • Cumar Chennam రెండు విషయాలండి...1. అమెరికా సామ్రాజ్యవాదాన్ని, రష్యా లో అప్పటి పాలనని కలిపి చూడటం కరెక్ట్ కాదు, చాలా తేడా ఉంది..అప్పటి పరిస్తితులు, సోషలిజం మీద దాడులు, వాటి వెనుక దాగిన కుట్రలను అర్ధం చేసుకుంటే రెండిటిని కలిపి చూడరు...2. రష్యా కమ్యు్నిజం పై, చైనా కమ్యునిజం పై సిపిఎం పార్టీ పుట్టినప్పుడు ఆ మహా సభలలో చాలా స్పష్టంగా చెప్పింది, వారి విధానాలకి ఇక్కడ పార్టీ విధానాలకి సంభందం లేదని...గమనించగలరు.
    17 hrs · Like
  • Sree Sri hi nani, i am sorry but i dont kno how u came to a conclusion that i am supporting america from what i said.. not a single word came out in support of it... and neither did my question implicitly say that america is good.. i totally agree america is bad, but russia isnt a saint either.. but i have never seen any leftist leader saying anything about them, why... just coz its a communist country.. none said anything abt what russia did to afghanistan in the 80's, nothing abt the proxy war they waged in croatia and serbia, chechanya, the invasion of ukraine...isnt it double standards...??
    17 hrs · Like
  • రంగారావు గారి అబ్బాయి నాని సేమ్ ఇక్కడ కూడా ఇదేనా... ఒకడొచ్చి దేశాన్ని దోచుకుంటున్నాడు అంటే.. అది సర్లేగానీ నువ్వు support చేస్తున్నవాడు దోచుకోవట్లేదా.. అలాంటపుడు వీడు దోచుకుంటే తప్పేంటి అంటారు.. దేశం మనది ... కనీసం బైట వాడు దోయకుండా కాపాడుకుందాం... ఇలా మనమన గొడవల వల్లనే 400 యేళ్ళు బానిసలయ్యాం... మీరంతా కలిసి మరో సారి దేశాన్ని బానిసత్వం వైపు నడిపించడం ఎంతవరకూ సమంజసం
    17 hrs · Like · 3
  • Cumar Chennam ఈ దేశమ్లో పారిశ్రామిక అభివృద్దికి స్వాతంత్రం తర్వాత మనకు సాయం అందిచింది రష్యా అదీ రూపాయిలలో, అమెరికా కాదు...ఈ దేశమ్లో జరగబోయేవాటి గురించి మాట్లడదాం దయచేసి...మీరన్నట్టు రష్యా ఉక్రెయిను మీద దాడి చేయడం నిజమైతే, అందుకని మనం ఒబామా పర్యటనని ఆహ్వానిద్దామా..? ఆయన పర్యటన మనకి నష్టం, దాని గురించి అభిప్రాయం తెలుపగలరు.
    17 hrs · Like · 1
  • Bunny Sunny మరో దేశం మీద దాడి చెయ్యడం..ఎవడు చేసినా తప్పే!..దానికి పరిస్థితులు వేరు అని అనడం..బొంకడం కాదా?..దానికి మహా సభలకి..సంబంధం వుందని చెప్పారు చాలా దగ్గర సంబందం...వుంది..నిజంమరి!..
    17 hrs · Like
  • Bunny Sunny లేదు రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసినందుకు ..ఒబామా ని వెలేద్దామా?...
    17 hrs · Like
  • Cumar Chennam పరిస్థితులు వేరు కాబట్టి రష్యా దాడి చేసిందని నేనలేదండి..గమనించగలరు...సోషలిజం మీద జరిగిన దాడిని దృస్టిలో పెట్టుకొని చూడమన్నాను, మీరు చెప్పింది కరెక్ట్ కాదని చెప్పటానికి.
    17 hrs · Like
  • రంగారావు గారి అబ్బాయి నాని అమెరికా చేసిన చేస్తున్న పనులకు వెలేద్దాం... వితండవాదమే గనక మీ అభిమతం అయితే నాకు అంత సమయం కూడాలేదు.. Bunny Sunny గారు.. sorry.. carry on
    17 hrs · Like · 1
  • Cumar Chennam ఏంటండి ఇది..? నేను చెప్పానా అది అసలు..? రష్యా ఉక్రెయిను దాడిని మీరు ఒబామా భారత పర్యటనకు ఎందుకు లింక్ చేస్తున్నారు.
    17 hrs · Like · 2
  • Cumar Chennam దానికి దీనికి ఏంటండి సంభందం..? ఆయన పర్యటన మనకి మంచిదా చెడ్డదా అది చర్చ చేయండి దయచేసి.
    17 hrs · Like · 1
  • రంగారావు గారి అబ్బాయి నాని పార్టీ ల మీద అభిమానంతోనో , వ్యక్తులు ఆరాధన కోసమో దేశాన్ని తెరచాటున తాకట్టు పెట్టే ప్రక్రియను భుజాన వేసుకుంటే మన రాబోయే తరాలకు తెలిసీ ద్రోహం చేసినవారం అవుతాము... గుర్తుంచుకోండి సోదరులారా..
    17 hrs · Like · 4
  • ఆలోచన నూతన సమాజం కోసం ప్రియ బంధువులరా, చాల కాలం తర్వాత మీ అందరితో కల్సి ఓపెన్ ఫోరం లో డిస్కషన్ జర్గుతుంది. ఇక విషయానికి వద్దాం.కమ్యూనిస్ట్ ల గురుంచి మరల మాట్లాడుదాం. ఎందుకంటె కారత్ గారు , ఏచూరి గారు , మీరు, నేను భారతః దేశం లోనే ఉంటాం కాబట్టి, ఈ విషయం లో మనం తర్వాత పుర్తిస్తాయి లో చర్చిద్దాం. లేక పొతే ఒబామా కు రావాల్సిన ప్రచారం కమ్యూనిస్ట్ లకు వస్తుందేమో. మరల మీ మనోభాలు దెబ్బ తినవచ్చు. ఇక విషయానికి వస్తే నేడు ప్రపంచం లో ఏ మూలా ఉగ్రవాదం అనేది ఉన్నా, పుట్టుకొచ్చిన, పెరిగిన , ఇప్పుడు పోసిన్చాబడుతున్న దానికి అమెరికా ఆదిపత్య ధోరణి అనేది అందరకి తెలిసిన నిజం. తను, తన దేశ బహుళజాతి కంపెనీ ల కోసం, దేశాల అద్యక్ష్యులను కూడా చంపిన, చంపించిన ఘన చరిత్ర గల దేశం ప్రపంచం లో మరేది లేదేమో. మన మిత్రులు ఇక్కడ తరుచుగా పోస్టింగ్లు పెడుతున్నారు , తిడుతున్నారు, విమర్శిస్తున్నారు , Islamic ఉగ్రవాదం గురుంచి, అలనాటి ఆల్ ఖైద నుంచి, నేటి ISIS పుట్టుకలో, పెంచడం లో అమెరికా ప్రత్యక్ష పాత్ర జగమెరిగిన సత్యం. ఇక అమెరికా అద్యక్షుడు మన దేశానికి వస్తున్నాడు, దానికి మనం ఎందుకు నిరసన తెలుపుతున్నాం అనే అంశం , ఏ దేశ అధ్యక్షుడు ఐన మన దేశం తో ద్యైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకొని ఇరువురికి మేలు చేసే విధంగా ఉంటాయి. అమెరికా అద్యక్షుడు వస్తునాడు అంటే మాత్రం , తప్పకుండ మన దేశ సంపద ను తన దేశాలకు అడ్డంగా దోచుకోవడానికి మాత్రమే మనకు కనిపిస్తుంది, దానికి మన దేశ పాలకులు పార్లమెంట్ ను అపహస్యం చేస్తూ, పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేస్తూ SPEKAR గారు సంతకం పెట్టిన ఇంకు ఆరక ముందే 9 అర్దినన్సు లు విడుదలవడం దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. మిగత దేశాల కష్టం మీద బ్రతికే అమెరికా, తన జీవనం కోసం మిగత దేశ ల లో రేపిన మంటలు, ఆ దేశాల అస్త్యస్తం ఇవన్ని ఆందోళన కలిగించే అమ్సమే
    14 hrs · Unlike · 4
  • Sree Sri ఆలోచన నూతన సమాజం గారు... నేను మీతో ఎకీవభించాను... ఈ రోజు ఉగ్రవాదం ఈ స్థాయిలో ఉందంటే దానికి అమెరికా ఒక్కటే కారణం కాదు... రష్యా కూడా... తాలిబాన్ బీజం ఇప్పుడు పుట్టింది కాదు...రష్యా ఎప్పుడైతే ఆఫ్ఘానిస్తాన్ ని 80వ దశకం లో ఆక్రమించాలని చూసిందో ఆరోజున పుట్టినివాల్లె ఈ ముజహిద్దిన్ లు .... వాళ్ళే ఆ తరువాత తాలిబాన్, అల్ఖైదా గా మారారు.. ఒక్కల్లేమో communism ని చేతనైన్ని దేశాల్లో విస్తరింప చెయ్యాలని చూసారు మరొకరు ఎక్కడ అదేగానక జరిగితే మీరన్నట్టు వారి వ్యాపారాలు దెబ్బతింటాయో అని భయపడ్డారు. ఈ ప్రక్రియలో ఏ ఒక్కరు ఆ సంబంధిత దేశ సౌర్యభౌమిత్యాన్ని గౌరవించలేదు. ఇరాన్ ఇరాక్ యుద్ధం, వియత్నాం, హోన్దరుస్, ఆఫ్ఘానిస్తాన్ ఇలా ఏ దేశం పేరు తీసిన ఈ ఇరు దేశాల పాత్ర లేకుండా పోలేదు. పెద్ద చేపలకి చిన్న చేపలే కదండీ ఆహరం.
    12 hrs · Like
  • Bhanu Gouda ఆధారాలు లేకుండా మాట్లాడే వారికి ఎం చెప్పుతాం.? ఏటా 2లక్షల కోట్లు, yes అక్షరాల రెండు లక్షల కోట్లు అందులో మూడొంతులు అమెరికా నుండి సంపాదించుకొని, హైటెక్ సిటీ లో ఉద్యోగాలు, ఫ్లాట్లు , కార్లు, ..... ఇయన్ని ఫ్రీ గా దొరుకుతాయమ్మ ? అమెరికా నుండి వచ్చిన డబ్బు కాకపొతే ? సాఫ్ట్వేర్’ సంగతి సరే, మన వ్యవసాయ ఎగుమతులు కుడా 20 వేల కోట్లకు పై చిలుకే. 

    ఇక ప్రపంచ టెర్రరిస్ట్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే వారితో సంభాషించడమే పెద్ద జోక్. ఒక ఇరాక్ యుద్ధం తప్ప, చాలా యుద్దాలు అరబ్బు దేశాలు కొట్టుకుచచ్చినవే. అమెరికా పాత్ర కేవలం వారి దేశాన్ని సురక్షితం గా ఉంచుకునే భాగంలో మాత్రమె వారు తల దుర్చటం జరిగింది. పని అయ్యాక అమెరికా తన దారి తానూచూసుకుంటుంది. ఏ దేశమయిన వారి అవసరాలు వారు చూసుకోవలసిందే. మన దేశ ప్రజలే దేశాన్ని పట్టిచ్చుకోరు ఇక పక్కోడి దేశాన్ని తిట్టడం దేనికి ?
    8 hrs · Like · 1
  • Kiran Boggavarapu i always wonder what is with indian communists in bed with muslims and christians. In every other part of the country they are dead against to each other. Its occurs to me the commnunists are just anti-hindus period. They have not grown up from 60's. Grow up guys, its a different world.
    8 hrs · Like · 1
  • Bhanu Gouda lol Kiran they are just over grown teenagers stuck in school, upper middle school. Precisely 
    7 hrs · Like · 1
  • Bhanu Gouda //"ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ప్రజలపై దాడులు జరిపి వారి హక్కులను కబళిస్తున్న అమెరికా అధ్యక్షుడిని గణతంత్ర ఉత్సవానికి అతిథిగా ఆహ్వానించడం సబబు కాదు. "

    ఇది పచ్చి అబద్దం

    // " భారతదేశాన్ని తన రక్షణ వ్యూహంలో భాగస్వామిగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు "

    ఇంతకంటే మంచి వార్త ఇంకొకటి వుండదు. సహజ ప్రజాస్వామ్యాల మధ్య చక్కటి మిత్రత్వం పెరుగుతుంది. రష్యా ఇచ్చే తుప్పు పట్టే తుక్కు విమానాలు, ఫ్రాన్స్ వాడి దమ్ము లేని జట్కా బండి విహంగాల కన్న అమెరికా వాడి ఆధునిక విమానాలు , drones అదరహో.

    // "ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో అమెరికన్ కంపెనీలకు, దేశీయ బడా పెట్టుబడిదారులకు లబ్ది చేకూర్చే అనేక ఒప్పందాల కోసం మోడీ ప్రభుత్వం రాత్రింబవళ్లు అహర్నిశలు కృషి చేస్తోంది. "

    నిద్ర పోతున్న కమ్యూనిస్ట్ లకు ఎం చెప్తాం. అమెరికా ఆర్థిక పరిస్తితి సూపర్, నిన్ననే ఒబామా గారు "State of Union" ప్రసంగం లో పేర్కొన్నారు.

    కొంచెం కళ్ళు తెరిచి ఈ 2015 State of Union" చుడండి.

    https://www.youtube.com/watch?v=cse5cCGuHmE


    President Barack Obama delivers his sixth State of the...
    YOUTUBE.COM
    6 hrs · Like · 1
  • Om Kiran I don't like him as a person for not living for his 'word' and deceptions.. 
    BUT but I welcome the act of him coming to India FOR "ROLE", Position as 
    President of United States, current supper power(not sure about future, though) 
    President as powerful democratic country.
    6 hrs · Like
  • రంగారావు గారి అబ్బాయి నాని Bhanu Gouda రోజు రోజు మీ comment లలో అమెరికా భక్తిని చాటుకుంటున్నారు...
    //ఆధారాలు లేకుండా మాట్లాడే వారికి ఎం చెప్పుతాం.? ఏటా 2లక్షల కోట్లు, yes అక్షరాల రెండు లక్షల కోట్లు అందులో మూడొంతులు అమెరికా నుండి సంపాదించుకొని, హైటెక్ సిటీ లో ఉద్యోగాలు, ఫ్లాట్లు , కార్లు, ..... ఇయన్ని ఫ్రీ గా దొరుకుతాయమ్మ ? అమెరికా నుండి వచ్చిన డబ్బు కాకపొతే ? సాఫ్ట్వేర్’ సంగతి సరే, మన వ్యవసాయ ఎగుమతులు కుడా 20 వేల కోట్లకు పై చిలుకే.//
    యస్ ... నిజం... ఎంగిలి మెతుకులకు ఆశ పడి మహ పసాదంగా భావిస్తున్న బానిస మనస్కులు ఉండబట్టే మనం ఆర్థిక మరియు మానవ వనరుల దోపిడిని మహా ప్రసాదంగా భావిస్తాం... 
    https://hbr.org/.../how-u-s-businesses-can-succeed-in...
    మీకు అర్థం అయ్యే భాష లోనే చెప్తాను...
    మనం చేసే పని వల్ల ఒక కార్పొరేట్ కంపెనీకి పది లక్షలు లాభం వస్తేనే వాడు మనకు యాభై వేల జీతం ఇస్తాడు... ఇంత చిన్న logic మీరు ఎలా మిస్ అయ్యారు ... 
    భారత దేశంలో మానవ వనరులు cheap కాబట్టే మేం వస్తున్నాం అని అమెరికానే చెప్తుంటే... మీరేమో అమెరికా ఏదో మనకోసం త్యాగం చేస్తున్నట్టు మాట్లాడడం విడ్డూరం... 
    అందుబాటులో ఆర్ధిక , సహజ మానవ వనరులు పుష్కలంగా ఉన్న భారతదేశంలో వీటిని మన దేశ ప్రగతికి ఉపయోగించకుండా.. అవన్నీ అమెరికా చేతిలో పెట్టి వాడు విదిల్చే ఎంగిలి మెతుకులను మహ ప్రసాదంగా భావిద్దాం అనడం... బానిస మనసిక స్థితికి సంకేతం.. ఇది ఇంకోరకమైన దేశద్రోహం...


    Four things to keep in mind.
    HBR.ORG
    4 hrs · Unlike · 1
  • రంగారావు గారి అబ్బాయి నాని //"ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ప్రజలపై దాడులు జరిపి వారి హక్కులను కబళిస్తున్న అమెరికా అధ్యక్షుడిని గణతంత్ర ఉత్సవానికి అతిథిగా ఆహ్వానించడం సబబు కాదు. "

    ఇది పచ్చి అబద్దం ///

    ఇది చూసి కళ్ళు తెరవండి...

    http://www.cassiopaea.org/cass/uswars.htm


    The American Revolution 1775-1783 The Indian Wars 1775-1890 Shay's Rebellion 1786-1787 Rebellion Anti-(state)Government Rebels vs. Massachusetts The Whiskey Rebellion 1794 Rebellion Anti-Tax Rebels in Western Pennsylvania Quasi-War With France 1798-1800 Inter-State (Naval) War France Fries's Rebelli…
    CASSIOPAEA.ORG
    4 hrs · Unlike · 1
  • రంగారావు గారి అబ్బాయి నాని // " భారతదేశాన్ని తన రక్షణ వ్యూహంలో భాగస్వామిగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు "

    ఇంతకంటే మంచి వార్త ఇంకొకటి వుండదు. సహజ ప్రజాస్వామ్యాల మధ్య చక్కటి మిత్రత్వం పెరుగుతుంది. రష్యా ఇచ్చే తుప్పు పట్టే తుక్కు విమానాలు, ఫ్రాన్స్ వాడి దమ్ము లేని జట్కా బండి విహంగాల కన్న అమెరికా వాడి ఆధునిక విమానాలు , drones అదరహో.//
    మరి అమెరికా రక్షణ వ్యాహంలో భాగస్వామిగా ఉన్న Pakistan సాధిస్తున్న ప్రగతి ఏంటి... 
    ఈ క్రింది technology ని పాకిస్తాన్ కు ఇచ్చిన దాఖలాలు చూపించండి..
    http://defensetech.org
    అయినా తిండికోసం 50 శాతం మంది అల్లాడుతూంటే.. మనం america weapon business ను లాభాలబాటలో నడపడం కోసం కోరి యుద్ధాలు చేసి ఏం ఉద్ధరించాలి... మనల్ని బలంగా తయారు చేయడమే america కర్తవ్యం అయినపుడు Pak ను ఎందుకు ఎగదోయడం..


    Defense Tech exam­ines the inter­sec­tion of tech­nol­ogy...
    DEFENSETECH.ORG
    4 hrs · Like
  • Bhanu Gouda అయ్యా ఏదో లింక్ పెట్టి లిస్టు ఇస్తే పెద్ద ఉపయోగం లేదు . మేము సరిత్ర కుసింత సదివాం . వుండేది రాజధాని దగ్గర ఆయ్ , కొంత మాకు తెల్ స్తది. 
    గెక్కడ గేం మాట్లాడాలో గక్కడ గది మాట్లాడ్తే మంచిగుంటది . 

    This forum is spreading lies. Sorry. You have no idea what you are talking about. Its the same case with bunch of your comrades. Refusing defense collaboration is downright BS. Don't pull numbers from thin air, if you want to talk I am up for it.
    where do you want to start ? Air Power ? or Naval ?
    4 hrs · Like
  • రంగారావు గారి అబ్బాయి నాని supporting a defence strategy without considering all the possible risk factors is not at all smart sir.. i think you might be working for any working company amd might be your duty to praise america.. but for us India is more important than anything
    4 hrs · Like
  • Bhanu Gouda And if you are concerned with feeding our poor, just let the country make money.

    అమెరికా తోని దందా జేసి మన software కంపెనీ లు వ్యవసాయం చేసెటోల్లు సంపాదిస్తున్నారు . దేశానికి సంపాదన లేకపోతె యాడికెల్లి తిండి పెడ్తావ్ అందరికి ?
    4 hrs · Like
  • రంగారావు గారి అబ్బాయి నాని lets start with naval.. i can give up my badminton match for this discussion..
    4 hrs · Like
  • Sree Sri this shud be intresting
    4 hrs · Like
  • 4 hrs · Like
  • Bhanu Gouda go ahead
    4 hrs · Like
  • Bhanu Gouda be my guest
    4 hrs · Like
  • Bhanu Gouda where do you want to start ?
    4 hrs · Like
  • రంగారావు గారి అబ్బాయి నాని దేశానికి సంపాదనకు కావలసిన వనరులు ఏంటి
    4 hrs · Like
  • రంగారావు గారి అబ్బాయి నాని i started it.. first let us complete the economy.. then we can step into defence..
    4 hrs · Like
  • Bhanu Gouda a nuke sub marine ? or a super carrier
    4 hrs · Like
  • Bhanu Gouda you tell me
    4 hrs · Like
  • Bhanu Gouda how much money the government makes ? and how much money the private companies make ? 
    And most important , how are jobs created. Without jobs, remember , we are all dead. We cannot even comment here . Need job , so that everyone feed the family.
    4 hrs · Like
  • రంగారావు గారి అబ్బాయి నాని what are the primary needs to create employment?
    4 hrs · Like
  • రంగారావు గారి అబ్బాయి నాని Lets start from the basics.. the arguments should not start to stand on the graveyards of the dead govts..
    4 hrs · Like
  • Bhanu Gouda You tell primary needs of employement. We were an agrarian society, but we evolved. So where does the employment comes from ? Agriculture ?
    4 hrs · Edited · Like
  • రంగారావు గారి అబ్బాయి నాని So according to your knowledge we are poor in natural and mineral resources.. right?
    4 hrs · Like
  • రంగారావు గారి అబ్బాయి నాని For creation of employment.. actually should be defined as work generation.. the basic needs is natural mineral human and financial resources.. it nt it right?
    4 hrs · Like
  • Bhanu Gouda Did I say that or you are putting it in my mouth
    4 hrs · Like
  • Om Kiran //primary needs to create employment?// first and fore most 
    Major
    1. Saftey
    2. Security 

    Minor..
    3, resources availability, and skill availability and mentoring for next generations..
    4. free, fair, transperant practices
    5.demand/supply chain and in between opportunities.. 

    a few..
    3 hrs · Edited · Like
  • Bhanu Gouda I said we are a predominantly agrarian society. And agrarian society cannot produces jobs for everyone. If you disagree with it then you have to provide jobs for everyone who is passing out from college.
    3 hrs · Like
  • Sree Sri here it comes... one more entry
    3 hrs · Like · 1
  • Bhanu Gouda What about technology ? Do we have capabilities to compete with the world?
    3 hrs · Like
  • Bhanu Gouda Lol natural minerals will help you , but how do you extract them ? Do you have tech to make everything in house ?
    3 hrs · Like
  • Bhanu Gouda Like that Ambanis , where did they buy their drill machines ? India or west / China / Japan ?
    3 hrs · Like
  • రంగారావు గారి అబ్బాయి నాని Any country is primarily an agrarian society and even america is not an exception.. the present example china also had same prevailing conditions as in India.. but it effectively use its resources for becoming economically strong nation.. and many such examples like japan germany and amny in european union stands with my argument,, Om Kiran argument is not even worth of attention as it is jusg a foolish act to disturb the discussion.. sorry kiran better luck next time
    3 hrs · Like · 2
  • Sree Sri lol nani.... looks like u just woke up a sleeping tiger... get ready for some theories
    3 hrs · Like
  • Bhanu Gouda Agriculture is less than 2% for america
    3 hrs · Like
  • రంగారావు గారి అబ్బాయి నాని Yes.. now you came to the point.. where did america bought its technology.. answer is by effectively using the human resources by giving them technical education and developing research capabilities.. it is well known that who is taking part in those tech building programs.. again the answer is the world human resources.. and there is a lot of difference between buying technology and welcoming FDI.. china bought d developed technology.. and we are welcoming them to our country to use the mineral natural (raw material) with the help of our human resources and use our market to sell those products (finished goods) and we are naming it as make in India.. it literally means..
    Pay less to buy our mineral and natural resources..
    Pay less to use our human resources..
    Pay less taxes...
    And after it sell your goods to ourselves.. 
    We can call it literally as Exploit India programme
    3 hrs · Edited · Like · 1
  • Bhanu Gouda And this is China at just 10%
    3 hrs · Like
  • రంగారావు గారి అబ్బాయి నాని Lets consider your opinion.. then why chinese investment is flooding into America..
    http://rhg.com/interactive/china-investment-monitor


    Directed by Michael Bay. With Sean Connery, Nicolas...
    IMDB.COM
    3 hrs · Like
  • Bhanu Gouda Lol sorry buddy. You need more lessons. Nobody gives you technology for free. Secondly, the most important thing is you buy it, if it takes longer to make.there are exceptions like defense and space research , which is a long race. Even in space we use others e.g sending a satellite using someone else rocket.
    3 hrs · Like
  • Bhanu Gouda Point here is is america our partner on trade and defense.no side trackimg
    3 hrs · Like
  • Bhanu Gouda Here is your options get some money from other country or get nothing.
    3 hrs · Like
  • Bhanu Gouda Self reliance is the best but that doesn't mean you cannot collaborate with others.
    3 hrs · Like · 1
  • రంగారావు గారి అబ్బాయి నాని And yes i agree to the lack or less availability of financial resources..
    Then if you consider the expected investment of america through FDIs.. it is around 41 billion USD in 3 yrs..
    http://m.timesofindia.com/.../articleshow/44360022.cms
    But when we consider the un counted money (black money) in India it is almost 2 trillion USD
    Then why govt is holding back its legs to get our own money back.. after which is possible, we dont need to sell our resources at cheaper rates.. 
    It is clearly showing the state of govt activities to protect economic interests of a section..
    3 hrs · Like
  • రంగారావు గారి అబ్బాయి నాని Collaboration means selling the nation.. lol..
    3 hrs · Like
  • Bhanu Gouda Let's be clear on one thing. We earn more from america than america earning from us.
    3 hrs · Like
  • Bhanu Gouda Lol do you know how much we earn from america and how much they earn from us ?
    3 hrs · Like
  • రంగారావు గారి అబ్బాయి నాని Statistics please.. and your statistics should reflect a long period in future...
    3 hrs · Like
  • Bhanu Gouda and the numbers are from authentic source, not some junk site, its from US government site.
    3 hrs · Like · 1
  • రంగారావు గారి అబ్బాయి నాని దేశ ప్రజల ప్రయోజనాలకు లింకున్న అంశాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు అణు పరిహార బిల్లు... యూనియన్ కార్బైడ్ మన దేశ ప్రజలకే నష్టం చేసి వెళ్లింది. నష్ట పరిహారం రప్పించుకోలేకపోయాం. అణు ప్లాంట్లు ప్రమాదాలకు నిలయాలు. అందుకే అమెరికాలో 30ఏళ్ల కిందే మూతేశారు. ప్రమాదాలు జరుగుతాయనడానికి జపాన్ ఫుకుషిమా ఉదాహరణ ఉండనే ఉన్నది. టెక్నాలజీ ఫెయిలయి ప్రమాదాలు జరిగినప్పుడు మన దేశ ప్రజానీకానికి నష్ట పరిహారం చెల్లించే అంశం నుంచి అమెరికా కంపెనీలను తప్పించేందుకు ఈ అణు పరిహార బిల్లు ఉద్దేశించబడింది. దీనిపై సంతకం పెట్టించుకోవడానికి ఒబామా వస్తున్నారు. మోడీ సర్కారు సైతం దీనికి పచ్చ జెండా ఊపుతోంది.
    3 hrs · Unlike · 1
  • Bhanu Gouda The total trade is 90 billions in 2012, with a deficit of 25 billions for USA.
    3 hrs · Like
  • రంగారావు గారి అబ్బాయి నాని Lol sir.. trade balance sheet wont reflect.. what we get and what we pay.. a lot of terms and factors should be considered when giving such a statement..
    If i say.. i am paying nothing to my bank(employer) but my bank pays me 40k per month.. is it a valid point
    3 hrs · Like
  • Bhanu Gouda lol, thats the difference, to put simply America sells to India and earns 34 billions, while India sells to America making 59 billions.
    3 hrs · Like
  • Bhanu Gouda so we earn more selling to America. to put simply if they stop buying from us then we loose. They will not stop buying from us until they find alternatives. So its a relation that goes on
    3 hrs · Like
  • Bhanu Gouda and regarding the union carbide, its half a billion settlement, that has nothing to do with the bigger scheme of things. Your communist leaders are telling you lies. Where is half a billion compared to billions of trade we do yearly.
    3 hrs · Like
  • రంగారావు గారి అబ్బాయి నాని That balance sheet dont reflect the productions buddy.. it just reflects the trade of finished goods.. the goods what we are selling america is also manufactured by america at cheaper rates.. and the technology also we are buying from america itself.. means they sell at cheaper rates to US on behalf of India.. as the production of same products takes a double cost when it is produces in america itself.. i think you dont have idea of world economy..
    3 hrs · Like
  • Om Kiran రంగారావు గారి అబ్బాయి నాని really, if safety security is NOT there you can have employment???? really?
    3 hrs · Like
  • Bhanu Gouda Please do not side track on the nuclear.... the issue is Veerabhadram garu lied. He might not know all these he probably copy pasted someone's rhetoric. 
    1.America is not liable for wars in middle east
    2.It is our interest to be friend's with america on defense
    3.It is our interest to be their partner to make more good here. We need to compete with china in making goods and sell to America.
    3 hrs · Like · 1
  • రంగారావు గారి అబ్బాయి నాని I am expecting the truth from you regarding the union carbide.. if you are really saying we got the justice in Union carbide case
    3 hrs · Edited · Like
  • రంగారావు గారి అబ్బాయి నాని Now you came to the point.. what is behind our "special interest" to join america.. when it is in debt.. when it is war rupt..
    3 hrs · Like
  • Bhanu Gouda hello, you don't understand simple english, the money we made, its not balance sheet, its income income statement. 

    You sell a pen to me and i give you 10 rupees, that 10 ruppes i am talking about, if you add up all its 59 billions we earned from America. Similarly they earned 34 billions from us. Of course there is a cost associated to make goods or produce agriculture.
    3 hrs · Like
  • Bhanu Gouda are you kidding ? Union carbide is water under the bridge , or over the bridge , which way you want it. Its long time back.
    3 hrs · Like
  • Bhanu Gouda So neither have knowledge not willingness to participate in debate. Sorry . 
    Lets go back to the jobs. Almost all of private sector jobs are created by private companies, that do business with America in software and services. LEave aside Ambani/TATA and engineering jobs. Rest of the jobs are related to IT or services. Which makes America as our main customer.
    3 hrs · Like · 1
  • Om Kiran and you know how IT or other jobs crippled in Hyderabad, during congress rule specially, during the telengana agitation and disturbance.. in the same period our jobs, i'm talking about huge.. not just 100s, 1000,10,000s but Lakhs.. went to near by states and few went to diff countries like phillipines, mexico, other south america etc.. 

    if saftey security had been asured, provided in ACTIONS we would loose such band wagon of jobs..
    It all boil downs to Safety, Security ..
    2 hrs · Like
  • రంగారావు గారి అబ్బాయి నాని Yes sir absolutely... these discussion is making me to remember some events in Indian history.. about the rulers who worshipped european colonies and allowed them to establish their business centres here and shown much more interest to make military pacts with them and how finally fell into the slavery.. 
    Yes its right.. we dont learn lessons from History.. 
    Hence prooved.. 
    You never answered my queries and always try to personal attack.. which proves your tactic way of argument which reflects your self interests and the nature of no bother about nation.. its ok.. we need lessons than experience.. we are used to realise things after getting suffered..
    2 hrs · Like
  • Bhanu Gouda నాని గారు, నేనింక మీకు చెప్పేది వాదించేది ఏమి లేదు . ఉద్యోగాల గురించి మాట్లాడుతే చైనా ఇన్వెస్ట్మెంట్ , treasury bonds గురించి మాట్లాడుతారు . దాని గురించి మీకు వేరే సమయం లో మాట్లాడుదాము . చాలా మంది ఎకనామిస్ట్ లు భారత దేశం లో వున్నారు . వారిని అడిగి తెలుసుకోండి . ఎందుకంటే నేను చెబితే మీకు నమ్మకం కలగదు . పూర్తిగా సంబంధం లేని విషయం అది . చైనా వాడు వాడి డబ్బుల్ని అమెరికాలో పెట్టాడు , అది వాడిష్టం . 
    మళ్ళి చెబుతున్నాను , కమ్యూనిస్ట్ లు చాలా తప్పు చేస్తున్నారు , దాదాపు దేశ ద్రోహం . 
    మీకు చెబితే అర్థం కాదు, ఎప్పుడో పాత సిద్దాంతాలు పట్టుకు వాదిస్తారు .

    ఒక పని చెయ్యండి , మన దేశానికి ఈ రెండు కొని పెట్టండి మీ రష్యా ని అడిగి . మొదటిది ఎలాగు వారి దగ్గర లేదు రెండొది ఎప్పుడు మునుగుతుందో తెలియదు . 
    బొమ్మలు తీసింది నేనే, పాత చిత్రాలు, బాగా దగ్గిరుండి సుసిన ఈ పెద్ద బండి ని . 
    కుసింత గూగుల్ చేసి సదువుకొని జ్ఞానార్జన సేయ్యండి .

    2 hrs · Like
  • Bhanu Gouda ఇదిగో ఇది రెండోది .
    2 hrs · Like
  • Bhanu Gouda not so fast, I answered it, did I have to be more clear ? అచ్చ తెలుగు లో సెప్పాలంటే మనం అమెరికా దగ్గర దోచింది (అమ్ముక సంపాదించింది ) , అమెరికా మనదగ్గర దోచిన (అమ్ముక సంపాదించింది ) దానికన్నా ఎక్కువ . 
    మరియు నేను మిమ్ములని బ్యాక్తిగత ( మీకు బెంగాల్ ఇష్టం కదా, కమ్యూనిస్ట్ లు) దూషణ ఏమి సెయ్యలేదు .
    2 hrs · Like
  • Bhanu Gouda మీరింకా ఉద్యోగాల గురించి సేప్పలేదు , ? వుద్యగాలు ఏడికెల్లి వస్తయొ ?
    2 hrs · Like
  • Bhanu Gouda And we did not even go near the security.
    2 hrs · Like · 1
  • Kusuma Rohini How ridiculous the discussion is. ...slogan is swadeshi but the actions r videshi. ....After the introduction of LPG polices in India. .India economy started an dependent economy. ...The act FERA was changed in to FEMA which was a nightmare,...to the corporates, repatriation of profits were allowed, our PSU were disinvested. .foreign companies r allowed to buy fixed assets in India. ..by seeing all these changes we people wanted an alternative. ...The present government said it was an alternative. ..but no way. ..it is alternative. ...paving the way for world corporate by asking the people to sacrifice. ..how come it can be ..? But some people with out knowledge arguing. ..Our navarathna companies r allowed FDI which is very dangerous. ..His visit will strengthen these actions. ...so we the people of India as a patriots gave the call GO BACK OBAMA. ...and we r correct. ..
    2 hrs · Like
  • Bhanu Gouda i know the communists are angry for not buying from russia, but country comes first. Russia is in bad shape, will be in bad shape.
    i am not sure they delivered that ship yet 
    http://www.themoscowtimes.com/.../india.../361320.html


    While India says it will pay an extra $1.2 billion for a...
    THEMOSCOWTIMES.COM
    2 hrs · Like
  • Bhanu Gouda sure whatever lol, నిఝం గా భలే మాట్లాడుతారు ఎర్ర మిత్రులు . రక్షణ లో ఒక్క ముక్క తెలియదు పనికి మాలిన వాదాలు . 
    ఓ పని సేయ్యండి software కంపెనీలు ఎత్తేద్దాం , ఎందుకంటే మొత్తం డబ్బులు అమెరికా నుండే కదా ? ఎత్తెయండహే ఓ పనైపొద్ది , ఒబామా లేదు గిబామా లేదు . ఖేల్ ఖతం దుకాన్ బంద్ . మొదలెడదాం నవ సమాజాన్ని , కార్మిక వర్గానికి చేయుతనిద్దాం .. lol
    2 hrs · Like
  • Ram Krishna కాంగ్రెసు అధికారంలో ఉండి ఈ ఎర్రజెండా పార్టీలు గో బ్యాక్ ఒబామ అంటే ఇంత గొడవ ఉండేది కాదేమో... FDI లు అప్పుడు వద్దు- ఇప్పుడు ముద్దు, నాకు తెలిసి ఇదే అణు ఒప్పందాన్ని upa 1లో బిజేపి కమ్యూనిస్టు పార్టీలు వ్యతిరేకించినట్టు గుర్తు
    2 hrs · Like · 3
  • Bhanu Gouda Ok folks it was nice debating you. You can do whatever , even throw a chappal on Obama. I care less. The fact is , we make more money from America. And lakhs of jobs are dependent on USA. About security ? its something I cannot debate here. Because you have no good points, you have no understanding of it.
    Have fun.
    2 hrs · Like · 1
  • Kusuma Rohini Adhikaaram lo unte oka maata. ...leka pothe inko maata. .....hell with Russia and China. ....We r least bothered. ....We r for India that too made in India. .people who r residing in America r eating their salt only. ...so will be loyal to USA no problem, we reside in indi fight for India. ...Regards. ..
    2 hrs · Like · 1
  • Ram Krishna Watch "Obama Tour should useful for India | 10tv" on YouTube - Obama Tour should useful for India | 10tv: http://youtu.be/3zfklzJsQzw
    2 hrs · Like · 2
  • Cumar Chennam Bhanu Gouda గారికి ముందుగా ధన్యవాదాలు చర్చ చక్కగా చేసినందుకు, ఎర్ర కుక్కలు లాంటి పదాలతో ఈ దేశం లో ఉండి ఇంకో దేశం వాళ్ళని సపోర్ట్ చేస్తారని మమ్మల్ని తిట్టనందుకు హహ....
    1 hr · Like · 3
  • Cumar Chennam మీ కామెంట్స్ ని బట్టి రెండు విషయాలు నేను చెప్పదల్చుకుంది.. ఏ దేశమైన ఇంకో దేశం తో ట్రేడ్ పాలసీ పెట్టుకున్నప్పుడు మన దేశ అవసరాలను దృస్టిలో పెట్టుకోవాలన్నదే నేను చెప్పదల్చుకుంది...అమెరికా ఒక్క మన దేశం నుండే కాదు అన్ని దేశాల నుండి వస్తువులను దిగుమతి చేసుకుంటుంది, చివరికి అక్కడి అమెరికను ఫ్లాగ్ కూడా వేరే దేశం లో తయారు చేసిందే..మీరు పెట్టిన కామెంట్ లో ఒక్క సారి అమెరికా ఇండస్ట్రీ వాటా జీడిపి లో, చైనా ఇండస్ట్రీ వాటా జిడిపి తో పోల్చి చూడండి..ఇది చాలా అవసరం ఎందుకంటే మొన్న వచ్చిన ఆర్ధిక సంక్షోభం లో చైనా డొమెస్టిక్ మార్కెట్ ఇండస్ట్రీస్ మీద, కేవలం అక్కడ ప్రజల ( అన్ని రకాల కార్మికుల ) కొనుగోలు మీద డిపెండ్ అయ్యింది కాబట్టి అమెరికా లా సర్వీస్ సెక్టార్ మీద ఆధారపడి దివాళా తియ్యలేదు, ఆ సర్వీస్ సె్క్టార్ మీద ఆధారపడినందుకే మన దేశం లో సంక్షోభం యొక్క ప్రభావం తగిలింది ఎక్కువగా, ముందుగా I.T ఉద్యొగలుకే ..
    1 hr · Unlike · 4
  • Cumar Chennam ఇప్పుడు మనం ఏం చేద్దాం..? అమెరికాతో ముడిపడే సర్వీస్ సెక్టార్ అందులోను 49 కోట్ల మంది కార్మికులలో 1% ఉండే I.T కి ఎక్కువ ప్రాధాన్యత ఇద్ధామా..? మనకి ఉపయోగపడే డొమెస్టిక్ ఇండస్ట్రీ మరియు ఎక్కువమంది ఆధరాపడిన వ్యవసయం మీద కేంద్రీకరిద్ధామా..? అలా అని i.t ని తక్కువ చేయమనట్లేదు, దాని కోసం రకక్షణ రంగాన్ని, దేశ సార్వబౌమత్వాన్ని తాకట్టు పెట్టొదంటున్నాం, చాలా దేశాలతో మనం వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకున్నాం , కాని అమెరికా వాణిజ్య ఒప్పందం వేరు, ఒక్క సారి అణుఒప్పందం గురించి చూడండి.
    1 hr · Unlike · 3
  • Cumar Chennam .అణుఒప్పందం లో భాగంగా అమెరికా బారత్ మధ్య కుదిరిన 123 ఒప్పందం బయటకు అంతా సజావుగానే ఉన్నట్లు కనిపిస్తుంది, పార్లమెంట్ లో కాని ప్రజలకు కాని చెప్పకుండానే ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు, 2005 లో జార్జిబుష్ మన్మోహను మధ్య కుదిరిన అవగాహన లో ని అంశాలు ఇప్పటికీ రహస్యమే, అయితె ఈ అవగాహన ప్రకారమే 2006 లో అమెరికా హైడ్ చట్టం తెచ్చింది, మన అణు ఒప్పందాన్ని ఈ హైడ్ చట్టమే నిర్దేసిస్తుంది, ఈ హైడ్ చట్టం లో మన స్వాతంత్రాన్ని హరించే అనెక షరతులు ఉన్నాయి, 2007 జులై 27 న వాషింగ్టం లో ఈ ఒప్పందం పై సంతకాలు చేసారు, చేసిన తరువాత మన క్యాబినెట్ లో ఆమోదానికి పెట్టారు, అప్పట్లో మాకు 63 మంది ఎం.పి ల బలం ఉంది కాబట్టి గోల చేస్తే పా్ర్లమెంట్ లో చర్చకు పెట్టారు....ఇప్పుడు హైడ్ చట్టం లో ఉన్న కొన్ని అంశాలు..1. భారత విదేశాంగ విధానం అమెరికా ప్రయోజనాలకు అణుగునంగా ఉండాలి..2. ఇరాను విషయం లో అమెరికా తీసుకునే నిర్ణయాలను అమెరికా సమర్దించాలి..3. హైడ్ చట్టం లో కనీసం 3 చోట్ల ఇరాను విషయమ్లో భారత్ ఎలా వ్యవహరించాలో చెప్పారు..4. అన్నిటికంటే కీలకం భారత్ అమెరికా మధ్య కుదిరిన వ్యూహాత్మక రక్షణ ఒప్పందం ( strategic defence frame work ).....ఇవి కొన్ని ఒప్పందాలు, అప్పుడు మన్మొహనుకు రక్షణ ఒప్పందం గురించి చెప్పింది, ఇప్పుడు మోడీ కి చెప్పింది ఆ రక్షణ ఒప్పందం గురించి ఒక్కటే మాట, వాళ్ళ అవసరాలకు మనం బలి కావొద్దు అని...
    1 hr · Unlike · 3
  • Cumar Chennam ఇంక పశ్చిమాసియా కావొచ్చు లాటిను అమెరికా దేశాలలోకి్ ఉగ్రవాదం పేరుతో చొరబడి అక్కడ యుద్దాల తో శాంతిని స్థాపించే అధికారం ఎవరిచ్చారు అమెరికాకి..? ఎందుకు చొరబడుతుందో అందరికి తెలుసు, .ఒక పక్క పాకిస్థాను ఉగ్రవాదం పెంచుతుందని మనం గగ్గోలు పెడుతున్నాం, ఉగ్రవాదం తగ్గించినందుకు 150 కోట్ల ఆర్ధిక సహాయం చేసింది ఆ దేశానికి అమెరికా, ఇలా ఇంకెవ్వరు చేయరు ఒక్క అమెరికా తప్ప, ఇలాంటి చర్యలు ప్రపంచ వ్యాప్తంగా చేస్తుంది అమె్రికానే, తన అవసరాల కోసం ఎంతకైనా దిగజారేది అమెరి్కానే అందుకే వ్యతిరేకిస్తున్నాం.
    1 hr · Unlike · 4