-----------ప్రశ్న... యావత్తు మానవ సమాజం దీనిపై ఆధారపడి ఉంది. ఇది లేకపోతే సమాజం ముందడుగే వేయదు. ప్రశ్న... ఓ మంచి పనిముట్టు.. సాధనం.. ఆయుధం... ప్రశ్న దోపిడీ దారులు మాత్రమే వేసుకుంటే వారి లాభాలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి. దోపిడీకి గురయ్యేవారు వేస్తే సమాజం పునాదులే కదిలిపోతాయి. అందుకే దోపిడీ చేసే వారు ప్రశ్న మీద త్రీవ నిర్బంధం విధిస్తారు. రాజ్యాన్ని, మతాన్ని, విశ్వాసాలను, ఆచారాలనూ ఇబ్బడి ముబ్బడిగా పెంచి `ప్రశ్న` పీచమణిచేందుకు ప్రయత్నిస్తారు. అయినా లొంగని `ప్రశ్న` పై సామాజిక దాడి, సామాజిక అణిచివేత అటు నుంచి భౌతిక దాడికి తెగబడతారు. అదీ ప్రశ్నకు ఉండే పవర్. అలాంటి `ప్రశ్న`ను బతికించాల్సిన అవసరం పురోగామి శక్తుల మీద ఉంది.
----------ప్రశ్నించేవారు.. ప్రశ్నించేవారే లేకపోతే ప్రశ్నకు మనుగడే లేదు. దోపిడీని, పీడనను, మతాలను, ఆచారాలను, సంస్కృతిని, మనిషిని కట్టి పడేసి బానిసత్వంలోకి లాక్కెళ్లే అన్ని అంశాలనూ ప్రశ్నించేవారు ఈ భూమ్మీద ఉండాలి. అప్పుడే ప్రశ్నించేవారు బతగ్గలరు. ప్రశ్నకూ మనుగడ ఉంటుంది.
-----------మాధ్యమంలో అనేక మార్పులు వచ్చాయి. మౌత్ టు మౌత్ దగ్గర్నుంచి, ప్రింటు, రేడియో, టివి, సెల్ ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా... ఇలా అభివృద్ధి చెందుతూ పోతోంది. ప్రతి సందర్భంలో ప్రశ్న లేవనెత్తే, ప్రశ్నించే చైతన్యాన్ని పెంచి పోషించే శక్తులపై దాడులు నిర్భంధాలు జరుగుతూనే ఉంటాయి. ఒకప్పుడు నోటితో వందేమాతరం అన్నందుకే జైళ్లలో కుక్కారు. ఎమర్జెన్సీ వంటి దుశ్చర్యలను దునుమాడినందుకు `ప్రజాశక్తి` వంటి పత్రికలను నిషేధించారు. రేడియోలు, టివిల మీద ప్రకటనల కుదింపు, నెట్ వర్క్ కత్తిరింపు వంటి చర్యలు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇంటర్నెట్, సామాజిక మీడియా వంతు వచ్చింది.
----------కమ్యూనిస్టులు, వామపక్ష శక్తులు, పురోగామి శక్తులు, ప్రజాస్వామిక శక్తులు సోషల్ మీడియాలో లేకపోవడం వల్ల అతివాదులకు, మతోన్మాదశక్తులకు, ఛాందసవాదులకు అది రహదారిగా మారిపోయింది. ప్రశ్నించేవాడికి రక్షణ లేకుండా పోయింది. సమాజాన్ని మార్చే శక్తులు సామాజిక మాధ్యమంలో లేకపోవడం, దాని ప్రభావాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ సమాజంలో కొద్దో గొప్పో ప్రశ్నించేందుకు సాహసించే వారు సైతం భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. సామాజిక మాధ్యమం ప్రభావాన్ని అర్థం చేసుకుంటేనే అందులో ప్రశ్నించే వారిని కాపాడేందుకు ప్రయత్నం జరుగుతుంది.
-----------మన కళ్ల ముందు అనేక ఉదాహరణలున్నాయి. ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకుని మత ఛాందసవాదులు హత్యలు చేయడం చేశాం. ఓ రచయిత్రిని బట్టలూడదీసి కొట్టాలి అనే కామెంట్లు పెట్టిన సంగతీ చూశాం. శివసైనికులు ఇద్దరు అమ్మాయిల మీద వీరంగం చేయడం చూశాం. అంతెందుకు హేతువాదాన్ని ప్రోత్సహించే పద్ధతిలో రాం గోపాల్ వర్మ ఒక కామెంట్ చేయగానే ఆయన మీద మతతత్వ శక్తులు ఎలా విరుచుకుపడిందీ చూశాం. మాట్లాడే వ్యక్తి ఎవరు అనే దానిని బట్టి కాకుండా, అతను మాట్లాడుతున్నదేంటి, దాని సారాంశం సమాజానికి ఉపయోగపడుతుందా? వంటి ప్రశ్నలు వేసుకుంటే వారిని కాపాడుకోవాల్సిన అవసరం గుర్తించేందుకు వీలు కలుగుతుంది.
----------2014 తరువాత మోడీ అధికారంలోకి వచ్చాడు. సంఘ్ శక్తులు విచ్చలవిడిగా పేట్రేగిపోతున్నాయి. మత పరమైన భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం, ప్రశ్నించేవారి పట్ల అసహనం పెంచడం లక్ష్యంగా వాటి పని ఉంటున్నాయి. హేతువాద దృక్పథంతో ఉన్నవారు సంఖ్యలో కొద్ది మందిగా ఉన్నప్పటికీ వారు అద్భుతమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వారిని వ్యక్తులుగా, విడివిడిగా లక్ష్యంగా చేసుకుని ఛాందసశక్తులు మానసిక దాడి చేస్తున్నారు. ప్రశ్న వేయకుండా, లేదా ప్రశ్న వేసే వారు పారిపోయేట్లు చేయడం వారి లక్ష్యం. ఒకవేళ మహిళలే ఈ ప్రశ్నలు వేసే ప్రక్రియలో పాలు పంచుకుంటే వారి మీద జరిగే దాడి వర్ణనాతీతం. (ఈ కింద ఒక ఉదాహరణ ఇచ్చాం చూడండి)
---------మరి మనం ఏం చేయాలి? హేతువాద దృక్పథంతోనూ, సమాజంలోని కుళ్లును, ఆధిపత్యధోరణులను ప్రశ్నించేతత్వంతోనూ, యావత్తు ప్రజానీకంపై భారాలు మోపే విధానాలను నిరసించేతత్వంతోనూ ఇప్పటికే పని చేస్తున్న వారిని గుర్తించాలి. వారు సోషల్ మీడియాలో చేసే చర్చల్లో పాల్గొనాలి. వారి మీద జరుగుతున్న దాడిని తిప్పికొట్టాలి. మేమున్నామంటూ భరోసా కల్పించాలి. ఈ పని చేస్తేనే సమాజంలో ప్రశ్న బతుకుతుంది. ప్రశ్నించేవారు బతుకుతారు. సమాజం సమగ్ర, సామాజిక అభివృద్ధి వైపు అడుగు ముందుకేస్తుంది.
--------సోషల్ మీడియాలో ప్రశ్న భయపడకూడదు. నవ్వాలి. ప్రశ్నలు స్వేఛ్చాగా ప్రవహించగలగాలి. చాందసశక్తుల శృంఖలాలను చేధించి దానిని ముందుకు దూసుకుపోనివ్వాలి. ఇలా జరగాలంటే ప్రశ్నించేవాడిని మనం కాపాడుకోవాలి. కమ్యూనిస్టులు, వామపక్షశక్తులు, పురోగామి శక్తులు, ప్రజాతంత్ర శక్తుల జోక్యం తోనే ఇది సాధ్యం.
------------------------------------------------------------------------------------------------
మత ఛాందసవాదుల దాడి తీవ్రత, స్వభావం అర్థం చేసుకోవడానికి సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ కింది చర్చ చూస్తే మీకే అర్థమవుతుంది. భారతదేశంలో ఉన్న ఓ అమ్మాయి (పేరు:ఝాన్సీ రాణి పూజ) దైవాన్ని ప్రశ్నించింది. దేవుడి పరిరక్షకులు ఆమె మీద కామెంట్ల దాడి చేసేశారు. (ఎన్నెన్ని విధాలుగా చేశారు? ఏమేం అన్నారు? వాటి గురించి మీరు కింద ఉన్న పోస్టు లింకును క్లిక్ చేసి చూడండి...) అమ్మాయి ప్రశ్నించడమే నేరం అనేంత వరకూ వెళ్లింది. అయినప్పటికీ ఆ అమ్మాయి వెరవలేదు. నిలబడింది. ఓర్పుగా సమాధానాలు చెప్పింది. ఇంతటి మనో నిబ్బరం ప్రదర్శించిన అమ్మాయికి అభినందనలు తెలుపుతూ, దాడి తీవ్రతను విశ్లేషిస్తూ కామెంట్ల చివర్లో జగదీష్ కుమార్ రాసిన విశ్లేషణను కూడా చదవండి.

No comments:
Post a Comment